Mumbai: ప్లాట్ గా ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్ గా ముగిశాయి. ఉదయం నిదానంగా ప్రారంభమైన సూచీలు భారీ నష్టాలతో మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ల ఆఖరి అరగంటలో కొనుగోళ్లు అండ లభించినా బలమైన లాభాలను ట్రేడ్ చేయలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతి కూల సంకేతాలు దేశీయ మార్కెట్లు ఎఫెక్ట్ చూపించాయి.
Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్ గా ముగిశాయి. ఉదయం నిదానంగా ప్రారంభమైన సూచీలు భారీ నష్టాలతో మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ల ఆఖరి అరగంటలో కొనుగోళ్లు అండ లభించినా బలమైన లాభాలను ట్రేడ్ చేయలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతి కూల సంకేతాలు దేశీయ మార్కెట్లు ఎఫెక్ట్ చూపించాయి.
ఉదయం సెన్సెక్స్ 62,738.35 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,867.95 నుంచి 62,554.21 మధ్య కదలాడింది. చివరకు 5.41 పాయింట్ల లాభంతో 62,792.88 దగ్గర ముగిసింది. నిఫ్టీ 18,600.80 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,622.75 నుంచి 18,531.60 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 5.15 పాయింట్లు లాభపడి 18,599.00 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసేటప్పటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 పైసలు పతనమై రూ. 82.68 దగ్గర నిలిచింది
ఏ షేర్లు లాభపడ్డాయంటే..(Mumbai)
సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, టైటన్, ఎన్‌టీపీసీ ,అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
జెఫ్రీ హాంప్టన్‌ను పిరమాల్ ఫార్మా కొత్త సీఓఓగా ప్రకటించింది. కంపెనీ షేరు ధర ఈ రోజు 2.58 శాతం నష్టపోయి రూ. 87 దగ్గర స్థిరపడింది.
శ్యామ్ మెటాలిక్స్ మే నెల విక్రయాలు 45 శాతం పుంజుకున్నాయి. దీంతో కంపెనీ షేరు ధర ఈ రోజు 5.89 శాతం పుంజుకొని రూ. 311.20 దగ్గర ముసిగింది.
ఇకియో లైటింగ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. ఇష్యూలో ఉన్న షేర్లన్నీ తొలి రోజే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రిటైల్ పోర్షన్‌లో 1.2 రెట్ల స్పందన లభించింది.