Last Updated:

Coromandel Express passengers: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 40 మంది ప్రయాణికులు విద్యుత్ షాక్ తో చనిపోయారా?

ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో కోరమాండల్  ఎక్స్‌ప్రెస్‌లోని  40 మంది ప్రయాణికులు ఓవర్‌హెడ్ కేబుల్స్ తెగిపోవడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఒడిశాలోని బాలాసోర్‌లో యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ రైలు బోగీలను ఢీకొనడంతో కేబుల్స్ తెగిపోయాయి.

Coromandel Express passengers: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 40 మంది ప్రయాణికులు విద్యుత్ షాక్ తో చనిపోయారా?

Coromandel Express passengers: ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో కోరమాండల్  ఎక్స్‌ప్రెస్‌లోని  40 మంది ప్రయాణికులు ఓవర్‌హెడ్ కేబుల్స్ తెగిపోవడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఒడిశాలోని బాలాసోర్‌లో యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ రైలు బోగీలను ఢీకొనడంతో కేబుల్స్ తెగిపోయాయి. దీనితో వీరు విద్యుత్ షాక్ కు గురయ్యారని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఒక పోలీసు అధికారి తెలిపారు.

లోటెన్షన్ వైర్లు బోగీలపై పడి..(Coromandel Express passengers)

గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) సబ్-ఇన్‌స్పెక్టర్ పాపు కుమార్ నాయక్, శనివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఇలా పేర్కొన్నారు. రైళ్లు ఢీకొనడం మరియు విద్యుదాఘాతం (తర్వాత) కారణంగా చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. లోటెన్షన్ వైర్లు బోగీలపై పడ్డాయి. అనేక మృతదేహాలు గుర్తించలేనట్లు ఉన్నప్పటికీ వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవు. ఈ మరణాలలో చాలా వరకు విద్యుదాఘాతం వల్ల సంభవించి ఉండవచ్చుఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ తాకినప్పుడు, విద్యుదాఘాతానికి గురైన వారు సెకనులో కొంత భాగాన్ని బోగీలను తాకి ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

మరోైపు గవర్నమెంట్ రైల్వే పోలీసు నిర్లక్ష్యం కారణంగా మరణం (IPC యొక్క సెక్షన్ 304-A) గుర్తించబడని వ్యక్తులపై కేసు నమోదు చేసింది. రైలు ప్రమాదంపై విచారణకు డీఎస్పీ స్దాయి అధికారిని నియమించారు. ప్రమాదం జరిగిన ఆరు గంటల తర్వాత అందిన ఫిర్యాదు మేరకు కటక్ సబ్ డివిజనల్ రైల్వే పోలీసు అధికారి రంజీత్ నాయక్‌కు విచారణను అప్పగించారు. అయితే తాజాగా సీబీఐ కు ఈ కేసు దర్యాప్తును అప్పగించారు.

ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌తో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే క్రాష్ జరిగిందని రైల్వే ఉన్నతాధికారులు మరోసారి స్పష్టం చేసారు. ఈ ప్రమాదంపై సీబీఐ సోమవారం విచారణ ప్రారంభించిన నేపథ్యంలో ఈ విషయం వెల్లడయింది.