Last Updated:

Mandous : ఆంధ్రప్రదేశ్‌కు పెను తుపాను ముప్పు… ఈ జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హై అలర్ట్…

Mandous : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను మరింత ప్రస్తుతం మరింత బలపడినట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు తీవ్ర తుఫానును మారి... దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాల వైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు దాదాపు 6 కి.మీ వేగంతో కదులుతోందని అధికారులు

Mandous : ఆంధ్రప్రదేశ్‌కు పెను తుపాను ముప్పు… ఈ జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హై అలర్ట్…

Mandous : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను మరింత ప్రస్తుతం మరింత బలపడినట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు తీవ్ర తుఫానును మారి… దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాల వైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు దాదాపు 6 కి.మీ వేగంతో కదులుతోందని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నాయి.

ఈ నేపథ్యంలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాను కదలికలపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తుఫాను ముప్పు పొంచి ఉన్న ఆయా జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తుంది. తుపాను తీరాన్ని తాకే సమయంలో, తరువాత ఏపీ లోని రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా తుపాను తీరం దాటే సమయంలో గంటకు 65 కిలో మీటర్ల నుంచి 85 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏపీ అలర్ట్‌ ద్వారా ఇప్పటికే ఆరు జిల్లాలో సుమారు కోటిమందికి తుపాను హెచ్చరికల సందేశాలను పంపినట్లు వెల్లడించారు.

ముఖ్యంగా ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు తుపాను ప్రభావం చూపే ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు అధికారులకు సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఈనెల 10 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది.

మరోవైపు తుఫాను ప్రభావం పొంచి ఉన్న జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారని తెలుస్తుంది. ఇప్పటికే సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మొత్తంగా  5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగం లోకి దిగాయి. ప్రకాశం – 2, నెల్లూరు – 3, తిరుపతి – 2, చిత్తూరు – 2 బృందాల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి: