Published On:

Heavy Rains: చార్ ధామ్ యాత్ర 24 గంటలపాటు నిలిపివేత

Heavy Rains: చార్ ధామ్ యాత్ర 24 గంటలపాటు నిలిపివేత

Chardham Yatra Stopped for 24 hours: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్రకు ఆటంకం ఎదురవుతోంది. యాత్రను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు నేడు, రేపు ఉత్తరాఖండ్ లో మరిన్ని భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలతో బార్ కోట్- యమునోత్రి మార్గంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్ ధామ్ యాత్రను 24 గంటలపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. చార్ ధామ్ యాత్రకు ప్రతిఏటా లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చార్ ధామ్ యాత్రకు తరలివచ్చారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా యాత్రికులను నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి: