Published On:

Texas: టెక్సాస్ వరదల్లో 24 మంది మృతి

Texas: టెక్సాస్ వరదల్లో 24 మంది మృతి

Floods In USA: అమెరికాలోని టెక్సాన్ ను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. విపత్తులో ఇప్పటి వరకూ 24 మంది మృతి చనిపోగా.. ఓ సమ్మర్ క్యాంపు నుంచి 25 మంది బాలికలు గల్లంతయ్యారు. అధికారులు వారి కోసం గాలింపు చెపట్టారు. కేవలం మూడు గంటల్లోనే 15 నుంచి 40 సెం.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.

 

కుండపోత వర్షాలకు టెక్సాస్ లోని హంట్ ప్రాంతంలో గ్వాడాలుపే నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నిన్న తెల్లవారుజామున ఆకస్మిక వరద పోటెత్తింది. దీంతో చాలా ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ప్రధాన రహదారులు వరద నీటిలో మునిగిపోయి నదిని తలపించాయి. వరదలకు 24 మంది చనిపోయారు. సెంట్రల్ టెక్సాస్ లో నిర్వహిస్తున్న ఓ సమ్మర్ క్యాంప్ ను వరద ముంచెత్తడంతో అందులోని 25 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపట్టారు. బోట్స్, హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు. మరోవైపు పిల్లలు తప్పిపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందిని అధికారులు రక్షించారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపడుతోంది.

 

 

 

 

ఇవి కూడా చదవండి: