KTR: రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
KTR: బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
KTR: బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
అంబేద్కర్ లేకపోతే.. తెలంగాణ లేదని వ్యాఖ్యనించారు.
రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం
బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
అంబేద్కర్ లేకపోతే.. తెలంగాణ లేదని వ్యాఖ్యనించారు. విగ్రహావిష్కణ కార్యక్రమంలో మంత్రులు.. మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దళితులు సమాజంలో తలెత్తి బతికేలా చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు.
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం.. కేసీఆర్ కే సాధ్యమని కొనియాడారు. నూతన పార్లమెంట్ భవనానికి.. అంబేద్కర్ పేరు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో దళితులకు ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.