Last Updated:

Joe Biden: భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

కాగా జీ20 సమ్మిట్ లో భాగంగా బైడెన్ భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. ఆయన తో పాటు అమెరికా మంత్రులు జానెత్ యెల్లెన్, గినా రైమోండో

Joe Biden: భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Joe Biden: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటన ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆయన భారత పర్యటనకు రానున్నారు. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ లో జీ20 సమావేశాలు జరుగునున్న విషయం తెలిసిందే. ఈ సమవేశాలకు భారత్ ఆదిథ్యం ఇస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీ 20 సమావేశాల్లో పాల్గొనడానికి బైడెన్ ఇండియా వస్తున్నారు. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వంలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రతినిధి డొనాల్డ్ లూ వెల్లడించారు. భారత్, అమెరికా ల మధ్య 2023 గొప్ప సంతవ్సరం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బైడెన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు(Joe Biden)

సెప్టెంబర్లో భారత్ లో పర్యటించేందుకు అధ్యక్షుడు బైడెన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారని డొనాల్డ్ లూ తెలిపారు. ‘ 2023 చాలా గొప్ప ఏడాది. అపెక్ కు అమెరికా, జీ 7 కు జపాన్ , జీ 20 కి భారత్ నాయకత్వం వహిస్తున్నాయి. క్యాడ్ కూటమి సభ్య దేశాలు నాయకత్వ పాత్ర చేపట్టడం గొప్పవిషయం. ఈ సమావేశాలు ఎన్నో అవకాశాలు కల్పించడంతో పాటు క్వాడ్ కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇక జీ20 కి భారత్ న్యాయకత్వం వహించడం మరింత శక్తిని ఇస్తుంది’ అని ఆయన తెలిపారు.

 

పలువురు మంత్రులతో సహా

కాగా జీ20 సమ్మిట్ లో భాగంగా బైడెన్ భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. ఆయన తో పాటు అమెరికా మంత్రులు జానెత్ యెల్లెన్, గినా రైమోండో , ఆంటోని బ్లింకెన్ లు కూడా ఇక్కడ పర్యటించనున్నారు. సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగే భారత్ , అమెరికా ఫోరమ్ లో మంత్రులతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొంటారు.