Hyper Aadi : మెగా ఫ్యామిలిని టార్గెట్ చేసే వారికి.. కుర్చీ మడత పెట్టి ***** అయ్యేలా హైపర్ ఆది స్పీచ్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
Hyper Aadi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. యంగ్ హీరో సుశాంత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. ఈ మూవీతో కూడా సక్సెస్ ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది.
ఇక ఈ ఈవెంట్ లో స్టార్ కమెడియన్ హైపర్ ఆది మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీని విమర్శించే వారందరికీ ఓ రేంజ్ లో ఇచ్చి పడేశాడు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా.. సినిమాలు, రాజకీయాలు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మీద వచ్చిన విమర్శలు ఇలా ఒక్కటేంటి.. మెగా ఫ్యామిలీ మీద వచ్చే అన్ని కౌంటర్లకి.. కుర్చీ మడత పెట్టి **************** అనేలా సమాధానాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ స్పీచ్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది అంటే.. ఆది ఏ రేంజ్ లో మాట్లాడాడో అర్ధం చేసుకోవచ్చు.
మధ్య తరగతి వాడు యుద్దం చేసేందుకు వచ్చాడు.. అప్పటి వరకు ఎంతో మంది యుద్దం చేస్తూనే ఉన్నారు.. ఒకసారి ఆయనకు వచ్చింది.. యుద్దం చేశాడు.. ఆ యుద్దభూమికి సైన్యాధిపతి అయ్యాడు.. ముప్పై ఏళ్లుగా ఆ యుద్దభూమిని ఏలుతూనే ఉన్నాను.. ఆయనే చిరంజీవి.. చిత్రపరిశ్రమను ఏలుతూనే ఉన్నాడు.. అన్నయ్య ఇంత మంది సినీ సైనికులను తయారు చేసి ఇంద్ర సేనాని అయితే.. అక్కడ తమ్ముడేమో జన సైనికుల్ని తయారు చేసి జన సేనాని అయ్యాడు.
అలాగే మెగాస్టార్ పేరు వినగానే అందరికి గూస్ బంప్స్ వస్తాయి.. హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్..గా ఉంటారు.. ఆస్తులు సంపాదించడం కన్నా అభిమానం సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. పాత తరానికి కొత్త తరానికి వారధి.. ఇన్ని కోట్ల మంది అభిమానులకు సారథి.. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో తెలియదు గానీ ఒక్కరైనా చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు.. నా దృష్టిలో సచిన్, చిరంజీవి ఒక్కరే.. క్రికెట్‌లో విమర్శలు వస్తే.. సచిన్ బ్యాటింగ్‌తో సమాధానం ఇస్తాడు.. సినిమాల్లో విమర్శలు వస్తే.. చిరంజీవి గారు సినిమాలతోనే సమాధానం ఇస్తారు..ఆచార్యతో విమర్శలు, వాల్తేరు తో సమాధానం చెప్పారు.. అలాగే ఇప్పుడు భోళా శంకర్ కూడా అంతకు మించి ఉంటుందని చెప్పారు.
చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత ఏదైనా సినిమా హిట్ అయితే దర్శకుడి వల్ల అని, ఫ్లాప్ అయితే చరణ్ వల్ల అని కామెంట్ చేశారు. అప్పుడు ‘రంగస్థలం’ వచ్చింది. నోరెత్తిన ప్రతి ఒక్కరూ చెయ్యి ఎత్తి జై కొట్టారు. కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరూ కామ్ గా ఉండిపోయారు. సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ కాలేదు. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ కాలేదు. కానీ, చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు అంటూ అభిమానులకు పూనకాలు తెప్పించే స్థాయిలో మాట్లాడారు.
చిరంజీవి రీ ఎంట్రీ తరువాత ఆయన సినిమాలు, బాక్స్ ఆఫీస్ స్టామినా గురించి మాట్లాడే వారందరికి ఆయన రేంజ్ ఏంటో మరోసారి గుర్తు చేశాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో కూడా ఇప్పటి స్టార్ హీరోలకు కూడా కష్టమవుతున్న 200 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే మెగా ఫ్యామిలీని విమర్శించే రామ్ గోపాల్ వర్మకి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. “చిరుత ఎంట్రీ ఇస్తే వారసత్వం రంగు పూసి విమర్శించారు. ఇండస్ట్రీ హిట్టులు వస్తే దర్శకుడు కారణం, డిజాస్టర్ అయితే రామ్ చరణ్ కారణం అని చెప్పుకొచ్చారు. వారందరికీ రంగస్థలంతో చరణ్ గట్టి సమాధానం ఇచ్చాడు. చరణ్ ని విమర్శించే వారికీ నేను ఒకటే చెబుతున్నా.. సచిన్ కొడుకు సచిన్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ అవ్వలేదు. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. చిరంజీవి గారు ఆయన తండ్రి గారికి ఎంత గౌరవం తెచ్చిపెట్టారో, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగి అంతకుమించి సంపాదించిపెట్టాడు”.
అలాగే ఈ మెగా బ్రదర్స్ గురించి మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ పై ప్రతి ఒక్కరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని చిరంజీవి గారు పొలిటికల్ న్యూస్ చూడడం మానేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన తిడితే పట్టించుకోకపోవచ్చు కానీ ఇప్పటి వరకు చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి.. మీకు పవన్ గారు గట్టిగా ఇవ్వబోతున్నారు. ఇక ఇద్దరు అన్నదమ్ములు కోసం దేనికైనా ఎదురునిలబడే నాగబాబు గారు గురించి చెప్పాలంటే.. చిరంజీవి గారు వెండితెర పై ఎంతమందికి లైఫ్ ఇచ్చారు. బుల్లితెర పై అంతమందికి నాగబాబు గారు లైఫ్ ఇచ్చారు. ఫైనల్ గా ఒకటే చెబుతున్నా ఈ ముగ్గురు అన్నదమ్ములను విమర్శించే వారందరికీ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చి అదరగొట్టారు.
‘ఠాగూర్’లో ‘తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించడం’ అని చెప్పినా సరే.. నిజ జీవితంలో ఆయన అందరినీ క్షమించారని.. వర్మ, గరికపాటి, అంబటి రాంబాబులపై పంచ లతో విరుచుకుపడ్డారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు అవార్డులు ఇచ్చిన ప్రభుత్వాలు, ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే విమర్శలు చేశారని ఆవేశంగా చెప్పారు. సుమన్, ఉదయ్ కిరణ్ వివాదాల్లో చిరంజీవి పేరు ప్రస్తావిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను కూడా ఉతికి ఆరేసిన రీతిలో మాటలు సంధించారు.