Last Updated:

Kolkata St Xavier University: ప్రొఫెసర్ బికినీ ఫోటోలు చూస్తున్న స్టూడెంట్ తండ్రి ఫిర్యాదుతో ప్రొఫెసర్ ను తొలగించిన యూనివర్శిటీ

కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీలో మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ బికినీలో వున్న ఫోటోలు ఆమె ఉద్యోగానికి ఎసరు తెచ్చాయి. యూనివర్శిటీ స్టూడెంట్ ఒకరు ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సదరు ప్రొఫెసర్ ను రాజీనామా చేయమని యూనివర్శిటీ కోరింది.

Kolkata St Xavier University: ప్రొఫెసర్ బికినీ ఫోటోలు చూస్తున్న స్టూడెంట్ తండ్రి ఫిర్యాదుతో ప్రొఫెసర్ ను తొలగించిన యూనివర్శిటీ

Kolkata: కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీలో మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ బికినీలో వున్న ఫోటోలు ఆమె ఉద్యోగానికి ఎసరు తెచ్చాయి. యూనివర్శిటీ స్టూడెంట్ ఒకరు ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సదరు ప్రొఫెసర్ ను రాజీనామా చేయమని యూనివర్శిటీ కోరింది.

బికె ముఖర్జీ పేరుతో తండ్రి రూపొందించిన ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల, నా కొడుకు ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా బహిర్గతం అయ్యేలా లైంగికంగా అసభ్యకరమైన రీతిలో పోజులిచ్చిన ప్రొఫెసర్ యొక్క కొన్ని చిత్రాలను చూస్తుండటాన్ని గమనించి నేను ఆశ్చర్యపోయాను. ఒక ఉపాధ్యాయురాలు ఆమె లోదుస్తులు ధరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం తప్పు, 18 ఏళ్ల విద్యార్థి తన ప్రొఫెసర్ ను అసభ్యకరంగా చూడటం సరికాదని ఆ లేఖలో వుంది.

దీంతో యూనివర్సిటీ అధికారులతో సమావేశానికి ప్రొఫెసర్‌ని పిలిచారు. ఈ సమావేశంలో ఆమెకు స్టూడెంట్ తండ్రి ఫిర్యాదు లేఖ మరియు ఆమె ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి కొన్ని ఫోటోగ్రాఫ్‌లను చూపించారు. అంతేకాదు ఆమెను ఉద్యోగం నుంచి వైదొలగాల్సిందిగా కోరారు.

అయితే తాను దాఖలు చేసిన పోలీసు రిపోర్ట్‌లో ప్రొఫెసర్ తన ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ చేయబడి ఉండవచ్చని, ఇది తన ఫోటోలను బహిర్గతం చేయడానికి మరియు పంపిణీ చేయడానికి దారితీసిందని పేర్కొన్నారు. తనను తొలగించేందుకు యూనివర్శిటీ తన క్యారెక్టర్ ను దెబ్బతీసేవిధంగా వ్యవహరించిందని అన్నారు.

ఇవి కూడా చదవండి: