Bharat Jodo Yatra End: భారత్ జోడో యాత్ర ముగింపు.. కాంగ్రెస్ కు పూర్వ వైభవం సాధిస్తుందా?
Bharat Jodo Yatra End: దేశంలోని ప్రజా సమస్యలను వినడం.. ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టాడు. భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబరు 7న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించాడు.
Bharat Jodo Yatra End: దేశంలోని ప్రజా సమస్యలను వినడం.. ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టాడు. భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబరు 7న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించాడు.
విభజన రాజకీయాలతో అల్లాడుతున్న దేశ ప్రజలను ఏకం చేయడానికి.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.
సెప్టెంబరు 7న ప్రారంభమైన ఈ యాత్ర.. శ్రీనగర్‌లో ముగిసింది.
దేశంలో క్రమంగా కాంగ్రెస్ అస్థిత్వం కోల్పోతున్న సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపారు.
సుమారు 5 నెలలపాటు సాగిన ఈ యాత్ర.. 4వేల కిలోమీటర్లు కొనసాగింది.
సుమారు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర
భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కచ్చింతగా ప్రభావం చూపుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ విద్వేష వైఖరికి ఈ పాదయాత్ర ప్రత్యామ్నాయ మార్గమని అన్నారు.
కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుంటూ వచ్చింది. కానీ ఈ ఏడాది ఆ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఊరటనిచ్చాయి.
అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించే ఎంపీ సీట్ల అంచనాలు కూడా ఈ యాత్రతో భారీగా పెరిగాయి.
12 రాష్ట్రాలను కలిపిన భారత్ జోడో యాత్ర
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ పాదయాత్ర సాగింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన యాత్ర.. భారత్ లోని 12 రాష్ట్రాలను చుట్టేసింది.
150 రోజులపాటు కొనసాగిన యాత్ర.. చివరకు కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగిసింది.
ఈ పాదయాత్రలో రాహుల్ కోట్లాది మందిని కలుసుకున్నారు. దేశంలో ఇంతవరకు ఏ పాదయాత్రకు రాని విధంగా భారత్ జోడో యాత్రకు భారీ స్పందన వచ్చింది.
ప్రజలతో మమేకమై పాదయాత్ర చేసిన రాహుల్.. వారి సమస్యలను తెలుసుకున్నారు.
మరోవైపు ప్రజలు కూడా రాహుల్ పంథాను అర్థం చేసుకుని అడుగులు కలిపారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా పాదయాత్రలో పాల్గొన్నారు.
ఇలాంటి యాత్ర చేయలాంటే.. కఠోర శ్రమ, మానసిక దృఢత్వం అవసరం. అందుకోసమే పాదయాత్రకు ముందుగానే తనను తాను సన్నద్ధం చేసుకున్నారు రాహుల్.
దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన అవసరం ఒకవైపు.. ప్రజలతో మమేకం కావాల్సిన లక్ష్యం మరోవైపు.. వెరసి రాహుల్ ను పాదయాత్రవైపు అడుగులు పడేలా చేశాయి.
దీంతో ఐక్యత అనే ఏకైక లక్ష్యం కోసం సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్ 7 న తొలి అడుగు పడింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన తర్వాత ఈ యాత్ర ప్రారంభమైంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హాజరయ్యారు. అప్పటి నుంచి ప్రతి రోజూ 23 కిలోమీటర్ల పాటు పాదయాత్ర కొనసాగింది.
రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటడం విశేషం.
రాహుల్ కు ప్రముఖుల మద్దతు
తమిళనాడులో 4 రోజులపాటు యాత్ర జరగ్గా.. తర్వాతి ఎన్నికలు జరిగే కర్ణాటకలో రాహుల్ పాదయాత్ర ఎక్కువ రోజులు సాగింది.
ఇక్కడ ఏకంగా 21 రోజులపాటు రాహుల్ పాదయాత్ర చేశారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో రాహుల్ ఒక్కరోజు మాత్రమే పాదయాత్ర చేశారు.
అక్కడ కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కర్ణాటకలో జరిగిన యాత్రలో సోనియా గాంధీ పాల్గొన్నారు.
అదే సమయంలో హిందీ వ్యతిరేక ఉద్యమానికి రాహుల్ గాంధీ సంఘీభావంగా తెలిపారు.
ప్రాంతీయ భాషలను కాదని.. హిందీని జాతీయ భాషగా చేసే ఆలోచన లేదని అప్పుడే స్పష్టం చేశారు.
కర్నాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజులు.. తెలంగాణలో 12 రోజుల పాటు ఈ యాత్ర సాగింది.
హైదరాబాద్ లోకి వచ్చిన తర్వాత.. చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగరేశారు. ఇదే చార్మినార్ నుంచి 19 అక్టోబర్ 1990న రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ప్రారంభించారు.
32 ఏళ్ల తర్వాత అదే స్థలంలో రాహుల్ జాతీయ జెండా ఎగరేయడం విశేషం.
ఇక రాహుల్ భారత్ జోడో యాత్రపై భాజపా పలు ఆరోపణలు చేసింది. రాహుల్ వేసుకున్న టీ షర్టు, బూట్ల గురించి బీజేపీ నేతలు ఎగతాళి చేశారు.
కరోనా విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ రాహుల్ కు లేఖ రాశారు. యాత్ర చివరి రోజుల్లో జమ్మూ కశ్మీర్ లో భద్రత కల్పించలేదు.
దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సరైన భద్రతా లేకపోవడం వల్ల పాదయాత్రకు ఒక రోజు బ్రేక్ పడింది.
ఇక దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు అశేష స్పందన లభించింది. స్వచ్ఛంద సంస్థలు.. ప్రముఖులు నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
అన్ని విభాగాలకు చెందిన ప్రముఖులు బాసటగా నిలిచారు. రాహుల్ తో కొద్దిదూరం నడిచి.. వివిధ అంశాలపై లోతైన చర్చలు జరిపారు.
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ క్యాడర్ లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/