Adani Group: అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలకు కారణమేంటి?
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ అదానీ పై మరోసారి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Adani Group: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ అదానీ పై మరోసారి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అదానీ గ్రూప్(Adani Group) అకౌంటింగ్ మోసాలు, స్టాక్స్ తారుమారు చేస్తోందని అమెరికాకు చెందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ‘హిండెన్ బర్గ్ రీసెర్చ్’ (Hindenburg Research) తాజాగా బాంబు పేల్చింది.
218 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఆదానీ గ్రూపు దశాబ్ధాలుగా ఇలాంట పద్దతిలోనే వెళ్తున్నట్టు తమ విచారణలో తేలిందని హిండెన్ బర్గ్ తెలిపింది.
ఆదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలివే..
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వ్యక్తిగత నికర ఆదాయం 120 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇదంతా గత మూడేళ్లలోనే వచ్చింది. గ్రూప్ లోని 7 కంపెనీల షేర్లు మూడేళ్లలో 819 శాతం లాభపడ్డాయి.
పన్నుల విషయంలో చూసిచూడనట్టు ఉండే కరేబియన్, మారిషస్ ల నుంచి యూఏఐ దేశాల్లో అదానీ కుటుంబం అనేక డమ్మీ కంపెనీలను నిర్వహిస్తోంది.
వాటి ద్వారా అవినీతి, మనీల్యాండరింగ్, ట్యాక్స్‌పేయర్ థెఫ్ట్ ల కోసం బదలాయింపులు జరుగుతున్నాయి.
అదానీ గ్రూపులోని మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు డజన్ల మందితో మాట్లాడి, వేలాది డాక్యుమెంట్లను పరిశీలించామని సంస్థ వెల్లడించింది.
దాదాపు 6 దేశాల్లో కంపెనీ కార్యలయాలను పరిశీలించినట్టు తెలిపింది. డమ్మీ కంపెనీల్లో కొన్నింటి నిజాలు బయటపడకుండా జాగ్రత్తపడ్డారు.
ఒకవేళ సంస్థ రిపోర్టుపై నమ్మకం లేకపోతే అదానీ గ్రూపు ఫైనాన్సియల్ డేటాను పరిశీలించండి.
7 కీలక కంపెనీల మూలాల ప్రకారం చూస్తే 85 శాతం దిగువన ఉన్నాయి. వాటి షేర్ల విలువలు మాత్రం ఆకాశంలో ఉన్నాయి. ఈ కంపెనీలపై భారీగా అప్పులు కూడా ఉన్నాయి.
పెరిగిన షేరు విలువలను చూపించి, భారీ మొత్తంలో రుణాలు దక్కించుకున్నారని సంస్థ పేర్కొంది.
గతంలో కూడా ఆదానీ గ్రూప్ పై ఆరోపణలు వచ్చాయి. ఫిచ్ గ్రూప్ కు చెందిన క్రెడిట్ సైట్స్ ను కూడా ఆదానీ గ్రూపు కు ఆందోళనకరమైన రుణభారం అని నివేదిక ఇచ్చింది.
దీనిపై కంపెనీల రుణ నిష్పత్తులు ఆరోగ్యకరంగా ఉన్నాయని, సంబంధిత రంగ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని అప్పట్లో అదానీ గ్రూప్ వివరణ ఇచ్చింది.
ఆరోపణలు సరైనవి కావు.. అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను ఆ కంపెనీ కొట్టిపారేసింది.
అవన్నీ ఆధారాలు లేని ఆరోపణలని, కంపెనీ షేర్లకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అదానీ గ్రూప్ (Adani Group) స్పష్టం చేసింది.
ఈ ఆరోపణలను గతంలెనే పరిశీలించామని , సదరు రిపోర్టు కుట్రలో భాగమేనని పేర్కొంది.
దేశంలోనే అతిపెద్ద ఫాలో ఆన్ పబ్లిక్ ఆపరింగ్ కు సిద్ధమవుతున్న సమయంలోనే అదానీ గ్రూపు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో హిండన్ బర్గ్ రీసెర్చ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు అమెరికా, భారత చట్టాల్లో ఉన్న నిబంధనలను పరిశీలిస్తున్నామని తెలిపింది.
దావా వేసుకోండి.. అదానీ గ్రూప్ పై సవాల్
మరోవైపు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న అదానీ గ్రూపు వ్యాఖ్యలను హిండెన్ బర్గ్ రీసెర్చ్(Hindenburg Research) స్వాగతించింది.
తమ రిపోర్టుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. చేతనైతే తమపై కోర్టుకు వెళ్లాలని సవాల్ విసిరింది.
అమెరికా హెడ్ క్వార్టర్స్ గా తమ సంస్థ పనిచేస్తుందని.. కాబట్టి అక్కడి నుంచే దావా వేసుకోవచ్చని సూచించింది.
ఒక వేళ అదానీ గ్రూపు ఆరోపణలు నిరోపించుకోవడంలో ఫెయిల్ అయితే తమ నివేదికకు కట్టుబడి ఉండాలని పేర్కొంది.
కుప్పకూలిన అదానీ షేర్లు
అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ రీసర్చ్ ఆరోపణల నేపధ్యంలో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆరోపణలు వచ్చిన 7 కంపెనీల షేర్లు 3 శాతం నుంచ 7 శాతం నష్టపోయాయి.
ఈ క్రమంలో జనవరి 26 వ తేది నాటి నివేదక ప్రకారం అదానీ ఒక్కరోజులోనే సుమారు 6 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 49 వేల కోట్లు నష్టపోయారు.
బ్లూమ్ బర్గ్ బిలియనర్ ఇండెక్స్ నివేదక ఈ నష్టాన్ని అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి అదానీ నాల్గో స్థానానికి పడిపోయారు.
బ్లూమ్ బర్గ్ బిలియనర్ ఇండెక్స్ లో జనవరి 24 న వెల్లడించిన జాబితా ప్రకారం ఆయన మూడో స్థానం నుంచి నాల్గో స్థానానికి పడిపోయారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/
ఇవి కూడా చదవండి:
- Union Budget 2023: బడ్జెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న మిడిల్ క్లాస్.. ఈ సారారైనా కరుణిస్తారా?
- Ambati Rambabu : తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?.. పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్లు..