Last Updated:

Nirmal: గడ్డి కోసం డాబా ఎక్కిన దున్నపోతు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

నిర్మల్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు గడ్డి కోసం పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. ఎంత కాలేసిందే పాపం గడ్డి కోసం ఏకంగా ఇంటి డాబాపైకే ఇక్కేసింది.

Nirmal: గడ్డి కోసం డాబా ఎక్కిన దున్నపోతు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Nirmal: తెలంగాణలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లాలో వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు గడ్డి కోసం పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. ఎంత కాలేసిందే పాపం గడ్డి కోసం ఏకంగా ఇంటి డాబాపైకే ఇక్కేసింది.

a-bull-climbs-house-terrace-in nirmal district

దున్నపోతుకు ఓ ఇంటి మెట్లపై గడ్డి కనిపించడంతో కడుపారా తింటూ మెట్లు ఎక్కుతూ వెళ్లింది. ఇంకా పైకి వెళ్తే ఇంకా ఏమైనా గడ్డి దొరుకుతుందేమోననే ఆశతో మెట్లన్నీ ఎక్కి డాబాపైకి చేరుకుంది. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. దీనితో బిక్కమొఖం వేసుకొని అటూ ఇటూ చూస్తూ ఉండిపోయింది. ఇక ఇక్కడే ఉండి లాభం లేదనుకుని అక్కడ నుంచి వచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడే అసలు సమస్య ఎదురైంది పాపం. గడ్డికోసం ఆసపడి నానాపాట్లు పడుతూ డాబా ఎక్కనైతే ఎక్కింది కానీ.. దిగడం మాత్రం రాలేదు. దానితో అటూ ఇటూ తిరుగుతూ గట్టిగా ఆరిచింది. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు ఈ దున్నపోతుకు అక్కడేం పని అయినా అక్కడికి ఎలా వెళ్లిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక దాన్ని కిందకు దించేందుకు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఎంత శ్రమించినా అది కిందకు దిగలేకపోయింది. దానితో గ్రామస్థులు పశువైద్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న వైద్యులు మత్తు మందు ఇచ్చినా దాన్ని కిందకు దింపటం కష్టమని భావించి చేతులెత్తేశారు. దాన్ని కిందకు దించాలంటే భారీ క్రేన్ తెప్పించాల్సిందేనని తేల్చి చెప్పారు.

a-bull-climbs-house-terrace-in nirmal district

ఇక ఈ మేరకు గ్రామ సర్పంచ్ తన సొంత డబ్బుతో ఓ భారీ క్రేన్‌ను తెప్పించి తాళ్ల సాయంతో జాగ్రత్తగా దాన్ని కిందకు దించారు. దీంతో ఆ దున్నపోతు యథావిథిగా ఊరిమీద పడి తిరగటం మెుదలు పెట్టింది. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇదీ చదవండి: కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి- హరిరామ జోగయ్య డిమాండ్.. జగన్‌కు లేఖ

 

ఇవి కూడా చదవండి: