Last Updated:

Toshakhana gifts: పాకిస్తాన్ లో దుమారం లేపిన తోషాఖానా బహుమతులు. ..వివరాలను వెల్లడించిన ప్రభుత్వం

తోషాఖానా బహుమతులు చాలా కాలంగా పాకిస్థాన్ రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా ఉన్నాయి. ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం తోషాఖానా లేదా పాకిస్తాన్ ఖజానా రికార్డులను బహిరంగపరిచింది.

Toshakhana gifts: పాకిస్తాన్ లో దుమారం లేపిన తోషాఖానా బహుమతులు. ..వివరాలను వెల్లడించిన ప్రభుత్వం

Toshakhana gifts: తోషాఖానా బహుమతులు చాలా కాలంగా పాకిస్థాన్ రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా ఉన్నాయి. ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం తోషాఖానా లేదా పాకిస్తాన్ ఖజానా రికార్డులను బహిరంగపరిచింది. ఇక్కడ రాష్ట్ర అధికారులు అందుకున్న బహుమతులు జమ చేయబడతాయి.చాలా మంది సీనియర్ రాష్ట్ర అధికారులు విదేశీ ప్రముఖుల నుండి స్వీకరించే ఖరీదైన బహుమతులను కొద్ది మొత్తం చెల్లించి, తర్వాత వాటిని బహిరంగ మార్కెట్‌లో అత్యధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, ఫెడరల్‌ కేబినెట్‌ మినిస్టర్లు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, రిటైర్డ్‌ జనరల్స్‌, జడ్జిలు, జర్నిలిస్టులకు పర్యటనలో వచ్చిన గిఫ్ట్‌ల వివరాలను బహిరంగ పరిచారు. మొత్తం 2002 నుంచి 2022 వరకు దేశంలోకి వచ్చిన గిఫ్ట్‌ల గురించి వివరాలను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఉంచింది.

ఖజానాకు జమచేయని బహుమతులు..(Toshakhana gifts)

గిఫ్ట్‌ల ద్వారా లబ్ధి పొందిన వారిలో జాబితాలో ప్రముఖల విషయానికి వస్తే ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఆరిఫ్‌ అల్వి, ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌, మాజీ ప్రెసిడెంట్‌ ఆసిఫ్‌ అలీ జర్దార్‌, పాకిస్తాన్‌ మాజీ మిలిటరీ చీఫ్‌ పర్వేజ్‌ ముషారఫ్‌,మాజీ ప్రధానమంత్రి షౌకత్‌ అజీజ్‌, మాజీ ప్రధానమంత్రి యుసుఫ్‌ రజా గిలానీతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. వారిలో చాలా మంది విదేశీ పర్యటనలకు వెళ్లివచ్చిన తర్వాత తోషాఖానాలో గిఫ్ట్‌లు జమ చేయలేదు. చాలా మంది వచ్చింది వచ్చినట్లు తమ తమ ఇళ్లకు తీసుకువెళ్లారు. ప్రభుత్వ ఖాజానాకు రూపాయి చెల్లించిన పాపాన పోలేదు.

బుల్లెట్ ఫ్రూప్ కార్లు.. రిస్ట్ వాచీలు.. బంగారు అభరణాలు..

జర్దారీ, నవాజ్‌ షరీఫ్‌లు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు బుల్లెట్‌ ఫ్రూప్‌ కార్లు స్వీకరించారు. ఈ వాహనాలకు ఏదో నామ్‌ కే వాస్తే అన్నట్లు కొంత మొత్తం చెల్లించి స్వంతం చేసుకున్నారు. ఇక పాకిస్తాన్‌ తెహెరిక్‌ ఏ ఇన్సాప్‌ (పీటిఐ) చైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన భార్య ఐదు అత్యంత ఖరీదైన రిస్ట్‌ వాచీలు, బంగారు ఆభరణాలు సొంత చేసుకున్నారు. పర్వేజ్‌ ముషారఫ్‌, షౌకత్‌ అజీజ్‌లు విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చినప్పుడు వచ్చిన గిఫ్ట్‌లకు ఖజానాకు రూపాయి కూడా చెల్లించకుండా దర్జాగా ఇంటికి తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా విదేశీ పర్యటనలకు వెళ్లివచ్చినప్పుడు పాక్‌ పాలకులు భారీగానే బహుమానాలు దక్కించుకున్నారు. అదే సమయంలో విదేశీ ప్రముఖులు అంటే వివిధ దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు, లేదా ప్రధానమంత్రులు పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చినప్పుడు వారికి లక్షలాది రూపాయాల విలువ చేసే బహుమతులు పాక్‌ పాలకులు అందజేశారు.

వివరాల్లోకి వెళితే బెనజీర్‌ భుట్టో భర్త, ప్రస్తుతం పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రిగా ఉన్న బిలావల్‌ భుట్టో జర్దారీ తండ్రి ఆసిప్‌ అలీ జర్దారీ తాను దేశధ్యక్షుడిగా ఉన్న సమయంలో విదేశీ పర్యటలనకు వెళ్లినప్పుడు ఆయనకు బీఎండబ్యు 760 ఎల్‌ఐ వైట్‌ కారు (సెక్యూరిటి వెర్షన్‌ ) జనవరి 26, 2009లో బహుమతిగా ఇచ్చారు. ఈ కాలువ విలువ 27.3 మిలియన్‌ రూపాయలుగా లెక్కగట్టారు. అయితే ది గ్రేట్‌ జర్దారీ దీనికి చెల్లించిన సొమ్ము అక్షరాలా నాలుగు మిలియన్‌ రూపాయిలు మాత్రమే. అలాగే మార్చి 2011లో ఆయనకు ఒక రిష్ట్‌ వాచ్‌ బహుమతిగా వచ్చింది. దాని విలువ మిలియన్‌ రూపాయలు, అయితే ఆయన చెల్లించింది మాత్రం కేవలం 1 లక్ష 58వేల 250 రూపాయిలు చెల్లించి వాచీతో పాటు ఇతర వస్తువులు సొంతం చేసుకున్నారు. అదే విధంగా జూన్‌ 2011లో ఆయనకు ఒక రిస్ట్‌వాచీ బహుమతిగా లభించింది. దీని వీలువ 1.25 మిలియన్‌ రూపాయిలు కాగా ఆయన చెల్లించింది కేవలం లక్షా 89వేల 219 చెల్లించి వాచీతో పాటు ఇతర వస్తువులు సొంతం చేసుకున్నారు. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ నాయకుడుగా కూడా అయిన జర్దారీకి కార్డియర్‌ రిస్ట్‌వాచీ బహుమతిగా లభించింది. దీని విలువ మిలియన్‌ రూపాయిలు. ఆయన చెల్లించింది 3లక్షల 21వేల చెల్లించి వాచీతో పాటు ఒక గన్‌ను సొంతం చేసుకున్నారు.

ఇక పాకిస్తాన్‌ మాజీ ప్రధానమత్రి నవాజ్‌ షరీఫ్‌ విషయానికి వస్తే పీఎంఎల్‌ -ఎన్‌ చీఫ్‌. సీనియర్‌ షరీఫ్‌కు మెర్సిడెంజ్‌ బెంజ్‌ కారు ఏప్రిల్‌ 20, 2008న బహుమతిగా వచ్చింది. దీని విలువ 4.25 మిలియన్‌ రూపాయలుగా లెక్క గట్టారు. దీనికి ప్రధానమంత్రిగా ఉన్న నవాజ్‌ షరీప్‌ చెల్లించింది అక్షరాల 6.3లక్షలరూపాయలు మాత్రమే అని డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. అయితే ఈ డాక్యుమెంట్లో ఆయన ఏ హోదాలో ఈ కారు దక్కించుకున్నరనే విషయం మాత్రం వెల్లడించలేదు.

ఖరీదైన రిస్ట్ వాచీలు స్వీకరించిన ఇమ్రాన్ ఖాన్ ..

ఇక మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ విషయానికి వస్తే.. ఆయన అత్యంత ఖరీదైన ఐదు రిస్ట్‌ వాచీలు విదేశీ పర్యటనల సందర్భంగా స్వీకరించారు. వాటిలో గ్రాఫ్‌ వాచీ ఒకటి. దీనికి విలువ 3.8 మిలియన్ రూపాయలు, ఇవన్నీ అక్టోబర్‌ 2018లో దక్కించుకున్నారు. ఇంత ఖరీదు చేసే విలువైన వాచీలకు ఖాన్‌సాబ్‌ చెల్లించింది మాత్రం కేవలం 7.54 లక్షలు. అలాగే సెప్టెంబర్‌ 2018లో ఖాన్‌ గ్రాఫ్‌ రిస్ట్‌ వాచీ దీని ఖరీదు 85 మిలియన్‌ రూపాయలు, దీంతో పాటు ఓ జంట కఫ్‌లింకులు వీటి ధర 5.6 మిలియన్‌ రూపాయలు. ఒక పెన్‌ దీని ధర 1.5 మిలియన్‌ రూపాయలు, ఒక రింగ్‌ దీని విలువ 8.75 మిలినయన్‌ రూపాయిలు వీటన్నిటి విలువ మొత్తం కలిపితే వంద మిలియన్‌ పాకిస్తాన్‌ రూపాయలు కాగా.. ఖాన్‌ చెల్లించింది మాత్రం ఐదో వంతు 20 మిలియన్‌ రూపాయిలు చెల్లించి సొంతం చేసుకున్నారు.

ప్రెసిడెంట్‌ ఆరఫ్‌ అల్వీ విషయానికి వస్తే ఆయన భార్య సమీనా అల్వీ 1.19 మిలియన్‌ రూపాయల విలువ చేసే నెక్లెస్‌ను అక్టోబర్‌ 2019లో బహుమతిగా దక్కించుకున్నారు. దీనికి వారు చెల్లించిన మొత్తం 8.65 లక్షలు మాత్రమే, నక్లెస్‌తో పాటు ఇతర విలువైన వస్తువులను సొంతం చేసుకున్నారు. ఫిబ్రవరి 2022లో ఆయన 2.5 మిలియన్‌ రూపాయల విలువ చేసే రోలెక్స్‌ వాచీ బహుమతిగా వచ్చింది. ఆయన దానికి 1.2 మిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకున్నారు.