Home / అంతర్జాతీయం
చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్ యూనివర్శిటీ భవనంలో గురువారం జరిగిన కాల్పుల్లో 16 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారని చెక్ పోలీసులు మరియు నగరం యొక్క రెస్క్యూ సర్వీస్ తెలిపింది. ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా తన షెడ్యూల్ ఈవెంట్లను రద్దు చేసుకుని ప్రేగ్‌కు వెళ్తున్నారు.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 33 మంది మరణించారు. లెబనాన్ నుండి ఉత్తర ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన ఆరు రాకెట్లను అడ్డుకున్నామని, దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
చైనాలోని గన్సు మరియు కింగ్హై ప్రావిన్స్‌లలో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా 116 మందికి మరణించగా, 200 మందికి పైగా గాయపడినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వాయువ్య చైనాలోని పర్వత ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా సుమారుగా 100 మంది మరణించగా మరో 100 మంది శిధిలాల కింద కూరుకుపోయారని గాజాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం పేర్కొంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 100 మందికి పైగా మరణించగా, శిథిలాల కింద 100 మంది చిక్కుకున్నారు. మరో 20 మంది గాయపడ్డారు.
మెక్సికోలోని ఉత్తర-మధ్య రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ సీజన్ పార్టీపై ముష్కరులు దాడి చేయడంతో కనీసం 16 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఆయనపై కరాచీలో విషప్రయోగం జరిగినట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడీఎఫ్ ) ఉత్తర గాజాలోని షెజాయా పరిసరాల్లో జరిగిన పోరాటంలో ముగ్గురు ఇజ్రాయెలీ బందీలపై పొరపాటున కాల్పులు జరిపినట్లు సైనిక ప్రతినిధి డేనియల్ హగారి శుక్రవారం తెలిపారు.షెజాయాలో జరిగిన పోరాటంలో ఐడీఎఫ్ పొరపాటున 3 ఇజ్రాయెలీ బందీలను శత్రువులుగా గుర్తించి కాల్పులు జరపడంతో బందీలు మరణించారు.
చైనా రాజధాని బీజింగ్ లో రెండు మెట్రో రైళ్లు ఢీకొనడంతో 500 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన 515 మందిలో, 102 మంది ఎముకలు విరిగి ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
భారత్‌తో సహా 33 దేశాల పర్యాటకులకు వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం మరియు హస్తకళల మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి ప్రకటించారు. పర్యాటకుల రాకపోకలను పెంచడానికి మరియు ఇతర దేశాల నుండి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది.
శుక్రవారం తెల్లవారుజామున ఆగ్నేయ ఇరాన్‌లోని ఒక పోలీసు స్టేషన్‌పై బలూచ్ మిలిటెంట్లు చేసిన దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించగా పలువురు గాయపడ్డారు.సిస్తాన్-బలుచెస్తాన్ప్రావిన్స్లోని రాస్క్ పట్టణంలో జరిగిన ఈ దాడిలో తీవ్రవాద జైష్ అల్-అడ్ల్ గ్రూపులోని పలువురు సభ్యులు కూడా మరణించారు.