Home / అంతర్జాతీయం
పశ్చిమ సుమత్రాలోని మౌంట్ మెరాపి అగ్నిపర్వతం బద్దలయింది. ఇండోనేషియా రెస్క్యూ సిబ్బంది 11 మంది పర్వతారోహకుల మృతదేహాలను కనుగొన్నారు. ఈప్రమాదం నుంచి ముగ్గురు పర్వతారోహకులు ప్రాణాలతో బయటపడగా, 12 మంది కనిపించలేదు.
ఉత్తర టాంజానియాలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 47 మంది మరణించగా 85 మంది గాయపడ్డారు.రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల (186 మైళ్లు) దూరంలో ఉన్న కటేష్ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసిందని జిల్లా కమీషనర్ జానెత్ మయంజా తెలిపారు.మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే జనాభాను పెంచాలని నిర్ణయించారు. దేశంలోని మహిళలను కనీసం ఎనిమిది మందిని లేదా అంత కంటే ఎక్కువ కనాలని కోరుతున్నారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో దేశం తన సైనికులను కోల్పోతున్నందున,వచ్చే దశాబ్దంలోగా దేశంలో జనాభాను గణనీయంగా పెంచుకోవాలని పుతిన్ పేర్కొన్నారు.
కాప్ 28 వాతావరణ సదస్సులో $475 మిలియన్ల 'లాస్ అండ్ డ్యామేజ్' ఫండ్‌ను అమలు చేయాలన్న యూఏఈ అధ్యక్షుడి 'చారిత్రక' నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన కాప్28 సదస్సు కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
తూర్పు ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో గుర్తుతెలియని ముష్కరులు బాంబులతో దాడి చేయడంతో కనీసం 11 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. దాడికి బాధ్యులమని ఏ గ్రూపు వెంటనే ప్రకటించలేదు.
కజకిస్తాన్‌లోని అతిపెద్ద నగరం అల్మాటీలోని హాస్టల్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించినట్లు నగరంలోని అత్యవసర విభాగం ఒక ప్రకటనలోతెలిపింది.మృతుల్లో తొమ్మిది మంది కజకిస్థాన్ కు చెందిన వారు కాగా , ఇద్దరు వ్యక్తులు రష్యా, ఇద్దరు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వారని అల్మాటీ పోలీసు విభాగం తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు 'నమో డ్రోన్ దీదీ' కార్యక్రమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా చేపట్టిన విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో సంభాషించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన పథకాలను సద్వినియోగం చేసుకోవలన్నారు. ఈ పథకాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరతాయని తెలిపారు.
యునైటెడ్ స్టేట్స్ మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన హెన్రీ కిస్సింజర్ బుధవారం 100 సంవత్సరాల వయస్సులో మరణించారు.కిస్సింజర్ కనెక్టికట్‌లోని తన ఇంట్లో మరణించారని కిస్సింజర్ అసోసియేట్స్ తెలిపింది.
అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో స్పృహతప్పి కనిపించిన ఒక వ్యక్తిని జపాన్ కోస్ట్‌గార్డు సిబ్బంది హుటాహుటిన యకుషిమాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.
ఖతార్- మరియు ఈజిప్ట్ మధ్యవర్తిత్వ ఒప్పందం శుక్రవారం అమలులోకి వచ్చినప్పటి నుండి హమాస్ 50 మందికి పైగా ఇజ్రాయెల్ మహిళలు మరియు పిల్లలను విడుదల చేసారు. వారిలో 17 మంది థాయ్‌లాండ్ పౌరులు ఉన్నారు.అక్టోబరు 7న హమాస్ దాడుల్లో పట్టుబడిన 160 మందికి పైగా బందీలు ఇప్పటికీ గాజా స్ట్రిప్‌లో ఉన్నారు.