Home / అంతర్జాతీయం
Iran – Israel War Update: ఇరాన్ నుంచి అణు ముప్పును తాము ఒక వ్యూహం ప్రకారం అణచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు తెలిపాయి. ఇప్పటికే తమ ఎయిర్‌ఫోర్స్ ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ వెల్లడించారు. తాము ఒక పద్ధతి ప్రకారం ఇరాన్‌లోని అణుముప్పును నాశనం చేస్తున్నామని తెలిపాయి. తమ దాడులు వారి నష్టాన్ని గణనీయంగా పెంచుతున్నాయని, ఫలితంగా వారి బాలిస్టిక్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ […]
Jaffar Express Bomb Explosion in Pakistan: పాక్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ వద్ద రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు మార్గంలో ఐఈడీ బాంబు అమర్చడం వల్ల పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని […]
Lewotobi Laki Laki Erupt in Indonesia: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్ధలైంది. లెవోటోబి లకి లకి అని అగ్నిపర్వతం నిన్న మరోసారి విస్ఫోటనం చెందింది. దీంతో తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్ లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఆకాశంలోకి భారీగా బూడిద ఎగసి పడుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా లకి లకి అగ్నిపర్వతం ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి. దీంతో ఆకాశంలోకి సుమారు 10 కిలోమీటర్ల ఎత్తవరకు […]
Iran Launched Hypersonic Missiles on Israel: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇజ్రాయెల్ పై హైపర్ సోనిక్ మిసైళ్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ.. యుద్ధం మొదలైందని ప్రకటించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. ఇవాళ అర్ధరాత్రి సుమారు 15 ప్రొజెక్టైల్స్ ఇజ్రాయెల్ లో పడ్డాయని స్థానికులు తెలిపారు. తర్వాత ఇరాన్ విమానాలు ఇజ్రాయెల్ లో చక్కర్లు కొట్టాయి. దీంతో సెంట్రల్ […]
Israel-Iran War: మనకు మనం ఆధునికులం అని చెప్పుకుంటాం. ఎంతో గర్వపడతాం. అయితే ఇదంతా మాటలకే పరిమితం. తాజా పరిణామాలను చూస్తుంటే ఇది.. యుద్దాల కాలమా అనే అనుమానం వస్తోంది. ఓ వైపు పాలస్తీనా – ఇజ్రాయెల్ వార్ నడుస్తుంటే.. మరో వైపు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం. ఈ రెండు చాలవన్నట్లు ఇపుడు తాజాగా ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య సంఘర్షణలు మొదలయ్యాయి. మనం 21వ శతాబ్దంలోకి ప్రవేశించి చాలా కాలమైంది.మనకు మనం ఆధునికులం […]
Benjamin Netanyahu Postpones his Son Wedding due to Iran – Israel War: దాడులు , ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇటు ఇజ్రాయెల్ అటు ఇరాన్ వ్యూహాత్మకంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా టెహ్రాన్ ది సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ఈ దాడి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు , ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఎవరికి ఎవరూ తీసిపోని రీతిలో […]
Iran Attacks on Israel with Ballistic Missiles: ఇజ్రాయెల్ పై ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ బలగాలకు ఊపిరి ఆడనీయకుండా చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ పై అత్యాధునిక క్షిపణిని ఇరాన్ ప్రయోగించింది. ఈ సరికొత్త బాలిస్టిక్ క్షిపణి రేంజ్ దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు అని ఇరాన్ మిలటరీ సీనియర్ అధికారులు ప్రకటించారు. దెబ్బకు దెబ్బ అనే సూత్రాన్ని ఇరాన్ పాటిస్తోంది. తొలిరోజు ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ కాచుకుంది. ఆ తరువాత రెండో […]
Israel-Iran War Updates: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఐదోరోజూ కొనసాగుతోంది. టెహ్రాన్‌పై టెల్అవీవ్ చేసిన దాడుల్లో ఇరాన్ సీనియర్-మోస్ట్ మిలిటరీ అధికారి, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు అలీ షాద్మానీ దుర్మరణం చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. అలీ షాద్మానీ సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ ప్రదేశంలో తలదాచుకున్నట్లు తమకు వచ్చిన సమాచారంతో దాడులు జరిపినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేస్తున్న పలు క్షిపణి దాడులకు అలీ నేతృత్వం వహించారని తెలిపింది. […]
Iran Ballistic missiles Breaks the Israel Iron Dome: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. అత్యంత శక్తివంతమైన డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. కాగా ఇరాన్ చేసిన ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ దద్దరిల్లిపోయింది. ప్రధానంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్ ను ఇరాన్ దాడులు దెబ్బతీశాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ .. ఇదొక అధునాత రక్షణ వ్యవస్థ. ఐరన్ డోమ్ గురించి ఇజ్రాయెల్ […]
Israeli attack on Iran’s Nuclear Facilities: పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించగా, రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా ఐదోరోజూ కూడా ప్రతిదాడులతో రెండుదేశాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. టెహ్రాన్‌లోని తమ పౌరులను స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్‌ను వీడి అర్మేనియాకు క్షేమంగా చేరుకున్నారు. ప్రత్యేక […]