China Earthquake: చైనాలో భూకంపం.. 118 మంది మృతి.. 400 మందికి గాయాలు
చైనాలోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్స్‌లలో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా 116 మందికి మరణించగా, 200 మందికి పైగా గాయపడినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వాయువ్య చైనాలోని పర్వత ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
China Earthquake: చైనాలోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్స్‌లలో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా 118 మంది మరణించగా, 400 మందికి పైగా గాయపడినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వాయువ్య చైనాలోని పర్వత ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
సోమవారం అర్ధరాత్రికి ముందు సంభవించిన భూకంపంలో గన్సు ప్రావిన్స్‌లో 100 మందికి పైగా మరియు పొరుగు ప్రావిన్స్ కింగ్‌హైలో మరో 16 మంది మరణించారని తెలిపింది.చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రకంపనలు సంభవించిన ప్రాంతంలో ప్రాణనష్టాన్ని తగ్గించడానికి మరియు రెస్క్యూ ప్రయత్నాలకు పిలుపునిచ్చారు.క్షతగాత్రులను తక్షణమే రక్షించి చికిత్స అందించాలని, భూకంప పరిస్థితిని, వాతావరణ మార్పులను నిశితంగా పరిశీలించి ద్వితీయ విపత్తులను నివారించడానికి కృషిచేయాలని స్థానిక అధికారులను కోరారు. భూకంపం 35 కి.మీ లోతులో సంభవించింది, దాని భూకంప కేంద్రం గన్సు యొక్క ప్రావిన్షియల్ రాజధాని నగరం లాన్‌జౌకి పశ్చిమ-నైరుతి దిశలో 102 కి.మీ. దూరంలో ఉంది.రెండు వాయువ్య ప్రావిన్స్‌ల మధ్య సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, క్వింగ్‌హై ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయని అధికారిక జిన్‌హువా వార్తా సంస్థ తెలిపింది.క్వింఘైతో ప్రావిన్షియల్ సరిహద్దు నుండి 5 కిలోమీటర్ల (3 మైళ్ళు) దూరంలో ఉన్న గన్సు యొక్క జిషిషాన్ కౌంటీలో భూకంపం సంభవించింది.
భారీ నష్టం..(China Earthquake)
భూకంపం కారణంగా రవాణా, కమ్యూనికేషన్లు మరియు మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లిందని నిపుణులు తెలిపారు.భూకంప తీవ్రత 5.9గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. నీరు మరియు విద్యుత్ లైన్లు, అలాగే రవాణా మరియు సమాచార మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రసార సీసీటీవీ నివేదించింది.విపత్తు జరిగిన ప్రాంతానికి టెంట్లు, ఫోల్డింగ్ బెడ్‌లు, క్విల్ట్‌లను పంపుతున్నట్లు తెలిపింది.