Home / అంతర్జాతీయం
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 240 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్ ) సెంట్రల్ గాజాలో త మంగళవారం 100 ప్రాంతాలపై దాడి చేసినట్లు తెలిపింది.
పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లాలో తొలిసారిగా హిందూ మహిళ డాక్టర్ సవీరా పర్కాశ్ దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనరల్ సీటుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు.
సెంట్రల్ నైజీరియాలో గ్రామాలపై వరుస దాడుల్లో భాగంగా సాయుధ గ్రూపులు సుమారుగా 160 మందిని చంపినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు సోమవారం తెలిపారు. మొదట కేవలం 16 మంది మరణించినట్లు సైన్యం ప్రకటించినప్పటికీ తరువాత మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా క్రైస్తవులు డిసెంబర్ 25న జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజు జరుపుకుంటారు. అయితే ఏసుక్రీస్తు పుట్టిన బెత్లెహామ్‌లో మాత్రం ఈ ఏడాది కళతప్పింది. ఎక్కడ క్రిస్మస్ ట్రీ, కానీ ప్రజల్లో సంతోషం మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ సంవత్సరం ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధం కారణంగా ఈ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు మరియు సావనీర్ దుకాణాలు నిర్మానుష్యంగా మారాయి.
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో చైనా యాజమాన్యంలోని నికెల్ ప్లాంట్‌లో సంభవించిన పేలుడు కారణంగా 13 మంది కార్మికుల మరణించగా పులువురు గాయపడినట్లు పోలీసులు మరియు తెలిపారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని పిలవబడే చైనా యొక్క ప్రతిష్టాత్మకమైన బహుళజాతి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇండోనేషియాలోని నికెల్ స్మెల్టింగ్ ప్లాంట్లలో జరిగిన ఘోరమైన ప్రమాదాలలో ఇది తాజాది.
ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ దేవాలయం గోడలను ఖలిస్థానీ అనుకూల నినాదాలతో నింపారు. ఈ ఘటన నెవార్క్ నగరంలో చోటు చేసుకుంది. స్వామినారాయణ మందిర్ గోడలపై రాసి ఉన్న నినాదాలను చూపిస్తూ, హిందూ అమెరికన్ ఫౌండేషన్ X లో చిత్రాలను షేర్ చేసుకుంది.
పాకిస్థాన్ లోని సింధ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా మొదటి హిందూ మహిళ మనీషా రోపేటాను నియమించారు.రోపెటా పాకిస్తాన్ యొక్క పితృస్వామ్య అడ్డుగోడలను బద్దలు కొట్టడమే కాకుండా, 26 సంవత్సరాల వయస్సులో అధికార పదవిలో నియమితులైన మొదటి హిందూ మహిళగా కూడా రికార్డు సృష్టించారు.
'మానవ అక్రమ రవాణా' అనుమానంతో 300 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఆపిన ఫ్రెంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై భారతీయ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు .
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( ఎఫ్ బి ఐ) నాలుగు సంవత్సరాల క్రితం న్యూజెర్సీ రాష్ట్రం నుండి తప్పిపోయిన భారతదేశానికి చెందిన 29 ఏళ్ల మహిళా విద్యార్థి గురించి సమాచారం ఇస్తే $10,000 వరకు రివార్డ్‌ను ఇస్తామంటూ ఆఫర్ చేసింది.