Home / అంతర్జాతీయం
గాజాలోని ఒక హోటల్ కింద హమాస్ సొరంగాలను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్ )శనివారం తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హోటల్ కింద AK-47 రైఫిల్స్, పేలుడు పదార్థాలు మరియు డ్రోన్లతో సహా అనేక ఆయుధాలను నిల్వ చేసిందని పేర్కొంది.
బంగ్లాదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), శుక్రవారం నలుగురి ప్రాణాలను బలిగొన్న ప్యాసింజర్ రైలులో జరిగిన అగ్నిప్రమాదంపై యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణలో దర్యాప్తును డిమాండ్ చేసింది. పార్టీ సీనియర్ జాయింట్ సెక్రటరీ రుహుల్ కబీర్ రిజ్వీ దీనిని మానవత్వంపై క్రూరమైన దౌర్జన్యం గా అభివర్ణించారు.
అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం యొక్క ఎగ్జిట్ డోర్ ఊడిపోవడంతో పోర్ట్‌ల్యాండ్‌లో అత్యవసర ల్యాండింగ్‌కు దారితీసింది. విమానం 16 వేల అడుగుల ఎత్తులో ఉన్నపుడు ఈ సంఘటన జరిగింది. ఈ సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
15 మంది భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియన్ జెండాతో కూడిన నౌక సోమాలియా తీరంలో హైజాక్ చేయబడిందని సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం సాయంత్రం హైజాక్‌కు సంబంధించిన సమాచారం అందుకున్న తర్వాత భారత నావికాదళం నౌక ('MV LILA NORFOLK')కు సంబంధించిన పరిణామాలను పరిశీలిస్తోందని వారు తెలిపారు.
జపాన్‌లో న్యూ ఇయర్ రోజున దేశం యొక్క పశ్చిమ తీరాన్ని తాకిన శక్తివంతమైన భూకంపంలో మరణించిన వారి సంఖ్య గురువారం 73కి పెరిగింది. కూలిపోయిన భవనాల క్రింద ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. సుమారుగా పదివేల మంది సహాయం కోసం వేచి ఉన్నారు.
అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దిగ్గజ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ దుర్మార్గాల చిట్టాను న్యూయార్క్ కోర్టు తాజాగా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్‌కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరౌరీని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు.
ఇరాన్లో బుధవారం జంట పేలుళ్ల కారణంగా 73 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. 2020 యుఎస్ డ్రోన్ దాడిలో మరణించిన టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమాని సంస్మరణ వేడుకలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ అత్యవసర సేవల ప్రతినిధి బాబాక్ యెక్తపరాస్ట్ 73 మంది మరణించారని, 170 మంది గాయపడ్డారని తెలిపారు.
జపాన్‌లో కొత్త ఏడాది మొదటిరోజే బలమైన భూకంపాలు సంభవించిన సుమారుగా 30 మంది మరణించారు. సోమవారం జపాన్ 155 భూకంపాలతో దెబ్బతింది, వీటిలో ప్రారంభ భూకంపం తీవ్రత 7.6 కాగా పలు భూకంపాలు 6 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించాయని జపాన్ వాతావరణ కార్యాలయం తెలిపింది.
బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త డాక్టర్ ముహమ్మద్ యూనస్‌కు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అతని మద్దతుదారులు దీనిని రాజకీయ ప్రేరేపితమని అభివర్ణించారు.