China: చైనాలో భూకంపం.. ఏడుగురి మృతి
నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో భారీ భూకంపం సంభవించింది. సుమారు ఏడుగురు మృత్యువాత పడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు.సిచువాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిక్కున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టు తెలిపింది.
China: నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో భారీ భూకంపం సంభవించింది. సుమారు ఏడుగురు మృత్యువాత పడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు.సిచువాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిక్కున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టు తెలిపింది.
భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు అందాలని అధికారులు తెలిపారు. ప్రాథమిక వార్తల ప్రకారం, సిచువాన్ ప్రావిన్స్‌లోని పలు పట్టణాల్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు తీవ్రంగా దెబ్బతినట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో టెలి కమ్యూనికేషన్ లైన్లు తెగిపోయాయి. రాజధాని చెంగ్డు, దానికి సమీపంలోని చాంగ్వింగ్ మెగాసిటీ సమీపంలో పలు భవంతులు కొద్ది సెకన్లు కంపించాయని చెబుతున్నారు. సహాయక చర్యల కోసం 500 మందికి పైగా సహాయ సిబ్బంది రంగంలోకి దింపారు. ఈ భూకంపానికి ముందు తూర్పు టిబెట్‌లో 4.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు యూఎస్‌జీఎస్ తెలిపింది. టిబెట్‌కు ఆనుకుని ఉన్న సిచువాన్ ప్రావిన్స్‌లో తరచు భూపంకంపాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. టిబెట్ పీఠభూమిలోనూ భూకంపాలు నమోదవుతుంటాయి.
ఇదిలా ఉండగా చెంగ్డూ ప్రాంతంలో కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్‌ను పొడిగించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వందలాది కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈ ఏడాది ఎండలు విపరీతంగా కాశాయి. ఎండలకు చాంగ్‌క్వింగ్ నది కూడా పూర్తిగా ఎండిపోయింది.