Last Updated:

Hydrogen Cell: హైడ్రోజన్ సెల్… ఎక్కడైనా ఎప్పుడైనా దీని ద్వారా కరెంట్

ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా విద్యుత్ అందించగల పరికరం హైడ్రోజన్ సెల్. దీని బరువు కేవలం 5 కేజీలు మాత్రమే. ఇది గంటకు 3.3 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. మరి దాని పూర్తి వివరాలేంటో తెలుసుకుందామా..

Hydrogen Cell: హైడ్రోజన్ సెల్… ఎక్కడైనా ఎప్పుడైనా దీని ద్వారా కరెంట్

Hydrogen Cell: సాధారణంగా కరెంట్ కావాలంటే ట్రాన్ఫార్మర్లు లేదా జనరేటర్ల ద్వారా విద్యుత్ ను పొందుతాము కానీ వీటిని మనం తేలికగా ఒకచోటి నుంచి ఒకచోటికి మార్చుకోలేము. సరదాగా బయటకు తీసుకెళ్లి అక్కడ మనం విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేము కదా… కానీ అతి తక్కువ బరువుండి.. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా.. విద్యుత్ అందించగల పరికరం ఉంటే బాగుండు అనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే..

హైడ్రోజన్‌ సెల్‌– దీనిని తేలికగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దీని ద్వారా విద్యుత్తును పొందవచ్చు. ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన టయోటా అనుబంధ సంస్థ వోవెన్‌ ప్లానెట్‌… చిన్నసైజు సిలిండర్‌లాంటి హైడ్రోజన్‌ సెల్‌కు రూపకల్పన చేసింది. దీని బరువు కేవలం 5 కేజీలు మాత్రమే అంటే మీరు నమ్ముతారా అక్షరాల నిజమండి దీని బరువు 5కిలోలే. ఇది గంటకు 3.3 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఇంధనం అయిపోతే మరల దీనిని రీఫిల్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ హైడ్రోజన సెల్ అమెరికా యూరోప్ ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ హైడ్రోజన్‌ సెల్స్‌తో వాహనాలకు, విద్యుత్‌ పరికరాలకు, ఇళ్లకు విద్యుత్‌ను సరఫరా చేసుకోవచ్చు.
విహారయాత్రకు వెళ్లేవారికైతే ఈ సెల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి ఇవి ఎలాంటి హానీ కలించవని వీటిని మరింత వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ ఉద్గారాల సమస్య తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Sejong University: ఇక పై అంతా వైర్ లెస్.. తీగలు లేని కరెంట్..!

ఇవి కూడా చదవండి: