Home / అంతర్జాతీయం
చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. దాదాపు 27 మంది ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
భారత ప్రభుత్వం తరఫున ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ వెళ్లారు. ఆదివారం ఉదయం ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్నారు.
నేపాల్ లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 17మంది మృతిచెందారు. ఈ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మరి ఆహారం, ఎరువుల కొరత, ఇంధన భద్రత సమస్యల పరిష్కారం ముఖ్యమని, నేటి యుగం యుద్ధ యుగం కాదని ప్రధాని మోదీ రష్యా అద్యక్షుడు పుతిన్ తో అన్నారు. ఉబెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన షాంగై సహకార సంస్ధ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశంలో కనెక్టివిటీని మెరుగుపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినప్పటికీ పొరుగు దేశం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నుండి దూరాన్ని కొనసాగించారు.
చైనాలోని దక్షిణ ప్రావిన్స్ హునాన్ రాజధాని చాంగ్షా డౌన్‌టౌన్‌లోని ఎత్తైన కార్యాలయ భవనంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. చైనా టెలికాం భవనంలోని 42వ అంతస్తులో మంటలు చెలరేగాయి.
ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో రేపటి నుంచి జరగనున్న ఎస్సీఓ సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయలుదేరి వెళ్లనున్నారు. సమర్ఖండ్లో ప్రధాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు ఇతర దేశాల నాయకులతో భేటీ అవుతారు.
కింగ్ చార్లెస్ III యొక్క మాజీ అధికారిక నివాసం, క్లారెన్స్ హౌస్‌లోని సుమారు 100 మంది ఉద్యోగులు తగ్గించబడతారని లేదా వారి ఉద్యోగాలను పూర్తిగా కోల్పోతారని తెలియజేయబడింది. ఈ ఉద్యోగులలో చాలా మంది దశాబ్దాలుగా పనిచేశారు
పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, కరడు గట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలో లేడని అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ సర్కారు తేల్చి చెప్పింది. అలాంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ భూభాగం నుంచే, అది కూడా అక్కడి ప్రభుత్వ సహకారంతోనే పనిచేస్తాయని కౌంటర్ ఇచ్చింది.
కెనడాలోని స్వామినారాయణ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా ఆ ఆలయం పై రాతలు రాశారు. కెనడాకు చెందిన ఖలిస్తానీ తీవ్రవాదులు ఆ పనిచేసి ఉంటారని భావిస్తున్నారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన ఆగంతకులపై చర్యలు తీసుకోవాలని భారత హై కమిషన్ ఓ ట్వీట్లో కోరింది.