Home / అంతర్జాతీయం
ఇటీవల బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన నేత రిషి సునాక్ మంగళవారం తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఒకరికొకరు ఎదురుపడి ఇద్దరు నేతలు పలకరించుకున్నారు.
యాపిల్ సహవ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ ధరించిన చెప్పులు దాదాపు $220,000కి అమ్ముడయ్యాయని వేలం సంస్థ తెలిపింది. 1970ల మధ్యకాలం నాటి "బాగా ఉపయోగించిన" ఈ చెప్పుల కోసం వేలంలో అత్యధిక ధర
జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఇండోనేషియాలోని బాలిలో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సదస్సుకు హాజరయిన కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. దానితో, సదస్సులో సేన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.
ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి అదేంటో చూసెయ్యండి.
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ 10,000 మందిని ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం. కార్పొరేట్, టెక్నాలజీ ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టడాన్ని ఆపేసినట్లు, గతవారం అమెజాన్ ఓ ఉన్నతాధికారికి పంపిన అంతర్గత మెమో ద్వారా తెలిపింది.
సాధారణంగా మనం ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు లేదా మనకు కావాల్సిన వారు డల్ గా ఉన్నప్పుడు కౌగిలితో వారికి ధైర్యం చెప్పడం లేదా మన సంతోషాన్ని పంచుకోవడం చేస్తాం. అయితే ఇదో మంచి వైద్య థెరపీ అని ఇలా చెయ్యడం వల్ల డబ్బులు సంపాదించవచ్చని ఎవరికైనా తెలుసా. ఓ మహిళ తాను ఇతరులను కౌగిలించుకున్నందుకు గంటకు అక్షరాలా 12,000 రుపాయలు వసూలు చేస్తుంది. కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం.
కొత్త యజమాని ఎలాన్ మస్క్ నేతృత్వంలో ట్విటర్లో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సంస్థలో పనిచేసే చాలా మంది ఉద్యోగస్థులు తమ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు ఊడిపోతాయో అంటూ బిక్కుబిక్కున విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మరో సారి 4400 మంది ఉద్యోగులు లేఆఫ్‌కు గురయ్యారు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు అని టాక్ నడుస్తున్న తరుణంలో తాజాగా ఈ జంట అభిమానులకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఓ టాక్‌షో చేయనున్నారు.
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాన్నే టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్లాల్ ఎవెన్యూలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటలో ఆరుగురు మరణించగా పదుల సంఖ్యలో ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు మీద ఒకదాని ఒకటి వాహనాలు ఢీ కొంటుంటాయి. మరి ఆకాశంలో నిత్యం అటూ ఇటూ చక్కర్లు కొట్టే విమానాలకు అలాంటి ప్రమాదాలు సంభవించవా అనే డౌట్ మీకు ఎప్పుడైనా కలిగిందా. అలాంటి క్రేజీ డౌట్స్ ఉన్న వారి సందేహాలను నిజం చేస్తూ తాజాగా గాల్లో తిరుగాడే రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ దృశ్యం చూసిన అక్కడి స్థానికులు ఔరా అంటూ నోరెళ్లబెట్టారు. ఈ దుర్ఘటనలో 6 మంది మృతి చెందారు.