Last Updated:

G20 Summit: జీ20 శిఖరాగ్ర సమావేశంలో కరోనా కలకలం

జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఇండోనేషియాలోని బాలిలో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సదస్సుకు హాజరయిన కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. దానితో, సదస్సులో సేన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.

G20 Summit: జీ20 శిఖరాగ్ర సమావేశంలో కరోనా కలకలం

G20 Summit: జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఇండోనేషియాలోని బాలిలో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సదస్సుకు హాజరయిన కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. దానితో, సదస్సులో సేన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.

ఇటీవల కంబోడియాలోని ఫ్నోమ్‌లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) సమ్మిట్‌ శిఖరాగ్ర సమావేశం జరిగింది. కాగా ఈ మీటింగ్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌కడ్ తో సహా ప్రపంచ నాయకులతో హున్ సేన్ సమావేశం అయ్యారు. ఆదివారం ముగిసిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి కంబోడియా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశంలో సేన్ చాలా మంది నాయకులతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. అనంతరం సోమవారం రాత్రి ఆయన జీ20 సదస్సు కోసం బాలి చేరుకున్నారు.

కాగా ఆ రాత్రి ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా దానిలో ఆయనకు పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఇండోనేషియా వైద్యులు ధృవీకరించారు. దాంతో, తాను కంబోడియాకు తిరిగి వెళ్తున్నట్టు, జీ 20తో పాటు బ్యాంకాక్‌లో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఫోరమ్‌లో తన సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్లు హున్ సేన్ తెలిపారు. కాగా, బాలిలో మంగళ, బుధవారాల్లో జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 20 దేశాల నేతలు ఇందులో పాల్గొంటున్నారు.

ఇదీ చదవండి:  G20 సదస్సుకు ప్రధాని మోదీ

ఇవి కూడా చదవండి: