Home / అంతర్జాతీయం
ఐఫోన్ 15లో యాపిల్ భారీ అప్గ్రేడ్లు చేపట్టనుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. రానున్న ఐఫోన్ 15 న్యూ బయోనిక్ ఏ17 బయోనిక్ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుందని సమాచారం. ఐఫోన్ 15 మోడల్స్‌లో పెరిస్కోప్ లెన్స్ వాడేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తుంది.
గ్రేట్ బ్రిటన్ రాజైన చార్లెస్- 3కి చేదు అనుభవం ఎదురైంది. కింగ్ చార్లెస్-౩ తన భార్య కెమిల్లాతో కలిసి ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి వేడకకు హాజరైన వారితో రాజు షేక్ హ్యాండ్ చేస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది.
మాల్దీవుల రాజధాని మాలేలో విదేశీ కార్మికుల లాడ్జిలో గురువారం మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
జీమెయిల్ వినియోగదారులకు అలర్ట్.. ఇకపై జీమెయిల్ వినియోగదారులంతా కొత్త జీమెయిల్ డిజైన్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని గూగుల్ పేర్కొనింది. ఈనెల నుంచి గూగుల్ కొత్త జీమెయిల్ యూజర్ ఇంటర్ఫేస్ను అందుబాటులోకి వచ్చేస్తోంది.
నార్వే యువరాణి వంశపారం పర్యంగా వచ్చిన సకల భోగాలను కాలదన్ని.. తన ప్రియుడితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ప్రిన్సెస్ హోదాతో పాటు విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని హైకోర్టు బుధవారం ఆదేశించింది. లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్ మరియు జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు.
ట్విట్టర్ యూజర్లపై ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ యూజర్లందరి నుంచి డబ్బులు వసూలు చేసే ప్రణాళికలో మస్క్ ఉన్నారని ప్లాట్‌ఫార్మర్ తన నివేదికలో వెల్లడించింది.
భారత దేశానికి ఆనుకునే హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న నేపాల్ దేశాన్ని ఇటీవల వరుస భూకంపాలు వణికించాయి. దీనితో ఆ భూకంపం ప్రభావం పక్కనే ఆనుకుని ఉన్న దేశసరిహద్దు భూ భాగం రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్‌లో 6.3 తీవ్రతతో భారీ భూమి కంపించింది.
ఈ ఏడాది యూరప్‌లో జూన్ నుంచి ఆగస్టు వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాడ్పులకు కనీసం 15వేల మంది మృతి చెంది ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
టర్కిష్ ఎయిర్‌లైన్స్ తన విమానంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ రుమీసా గెల్గికి వసతి కల్పించడానికి ఆరు ఎకానమీ సీట్లను తొలగించింది.