Last Updated:

Koo: ట్విట్టర్ మాజీ ఉద్యోగులకు ‘కూ’ పిలుపు

ట్విట్టర్ బ్లూ బర్డ్ లాగానే సేవలు అందిస్తుంది దేశీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘కూ'. అయితే ఇప్పుడు ట్విట్టర్ నుంచి తొలగించబడిన ఉద్యోగులకు తమవైపు ఆకర్షించే పనిలో పడింది.

Koo: ట్విట్టర్ మాజీ ఉద్యోగులకు ‘కూ’ పిలుపు

Koo: ట్విట్టర్ బ్లూ బర్డ్ లాగానే సేవలు అందిస్తుంది దేశీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘కూ’. అయితే ఇప్పుడు ట్విట్టర్ నుంచి తొలగించబడిన ఉద్యోగులకు తమవైపు ఆకర్షించే పనిలో పడింది. ఇటీవల కాలంలో మస్క్ ట్విట్టర్లో సమూల మార్పులు చేపట్టాడు. ముఖ్యంగా ఉద్యోగల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు మస్క్. ఇటీవల కాలంలో ఉద్యోగులను 18 గంటలు పనిచెయ్యాలని లేదంటే వెళ్లిపోవాలని పేర్కొన్న మస్క్ అంతకుముందు సగం మంది ఉద్యోగులను తొలగించారు. ముఖ్యంగా భారత్ లో అయితే 90 శాతం మంది ఉద్యోగులను తొలగించాడు.

ఈ పరిస్థితిని ట్విట్టర్ పోటీ సంస్థ కూ తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది. ట్విట్టర్ లో ఎక్కువ మంది ఉద్యోగులు వెళ్లిపోవడంతో ప్లాట్ ఫామ్ నిదానించింది. దీనితో అక్కడి యూజర్లను కూ ఆకర్షించే చర్యలు మొదలుపెట్టింది. కొత్త ఫీచర్లను ప్రకటిస్తోంది. కూ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్క మాట్లాడుతూ నిపుణుల కోసం తాము అన్వేషిస్తున్నామని, ముఖ్యంగా ఇటీవల మస్క్ తొలగించిన వారిని ఆహ్వానిస్తున్నామని ట్విట్టర్ వేదికగానే ఆయన ప్రకటించడం గమనార్ఙం.

అంతేకాకుండా #RIPTwiteer ట్విట్టర్ చూడ్డానికి బాధగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను నియమించుకుంటామని, తమ ప్లాట్ ఫామ్ ను విస్తరిస్తున్నామని ప్రకటించారు. త్వరలో అమెరికాలోనూ కూ ను విడుదల చేస్తామని సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ట ప్రకటించారు.

ఇదీ చదవండి: ట్విట్టర్లో కొత్త పాలసీ.. ఇకపై అలాంటి పోస్టులకు అడ్డుకట్ట

ఇవి కూడా చదవండి: