Last Updated:

FIFA World Cup-2022: ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ షురూ.. ఖతార్, ఈక్వెడార్ల మధ్య మ్యాచ్

నేటి నుంచి ఖతార్‌ వేదికగా ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఈ మెగాటోర్నీ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరుగనుంది. ఈ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మెుత్తంగా 32 జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో అతిథ్య జట్టు ఖతార్‌ ( Qatar)ఈక్వెడార్‌ను ఢీకొనబోతోంది.

FIFA World Cup-2022: ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ షురూ.. ఖతార్, ఈక్వెడార్ల మధ్య మ్యాచ్

FIFA World Cup-2022: నేటి నుంచి ఖతార్‌ వేదికగా ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఈ మెగాటోర్నీ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరుగనుంది. ఈ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మెుత్తంగా 32 జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో అతిథ్య జట్టు ఖతార్‌ ( Qatar)ఈక్వెడార్‌ను ఢీకొనబోతోంది. అల్‌ బేట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9గంటల30 నిమిషాలకు ప్రారంభంకానుంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు తొలిసారిగా ఖతార్ అతిథ్యమిస్తోంది. ఈ ప్రపంచకప్‌ మ్యాచ్ లను భారత్ లో స్పోర్ట్స్ 18 చానెల్, వూట్ యాప్ డిజిటల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈప్రపంచ కప్ కోసం ఖతార్ ఏకంగా 200 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. తొలిసారి ఈ వరల్డ్ కప్ టోర్నీలో మహిళా రిఫరీలు కనిపించనున్నారు.

ఫిఫా కప్ టోర్నీలో మెుత్తం టీమ్స్ అన్నింటినీ 8 గ్రూపులుగా విభజించారు. ఒక్కోదాంట్లో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి టీమ్ మిగతా మూడు జట్లుతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. మెుదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ప్రపంచకప్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ గా ఫ్రాన్స్ బరిలోకి దిగుతుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్‌ 1930లో స్టార్ట్ అయింది. ఈ సాకర్ టోర్నీలో అందరి చూపు ముగ్గురి ఆటగాళ్లపైనే వారే రొనాల్డో, మెస్సీ, నెయ్‌మార్‌. వీరు తమ జట్ల తరుపున ఏ మేరకు రాణిస్తారో వేచిచూడాలి. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో బ్రెజిల్ ఐదు సార్లు గెలుచుకుంది. ఇటలీ, జర్మనీ చెరో నాలుగు సార్లు కప్ ను సాధించాయి.  ఇప్పటి వరకు 21 ప్రపంచకప్‌లు జరిగాయి.

గ్రూప్‌-ఎ: ఖతర్‌, ఈక్వెడార్‌, నెదర్లాండ్స్‌, సెనెగల్‌
గ్రూప్‌-బి: ఇంగ్లండ్‌, ఇరాన్‌, అమెరికా, స్కాట్లాండ్‌/వేల్స్‌/ఉక్రెయిన్‌
గ్రూప్‌-సి: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్‌
గ్రూప్‌-డి: ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, ట్యునిషియా, యూఏఈ/ఆస్ట్రేలియా/పెరూ
గ్రూప్‌-ఇ: స్పెయిన్‌, జర్మనీ, జపాన్‌, కోస్టారికా/న్యూజిలాండ్‌
గ్రూప్‌-ఎఫ్‌: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
గ్రూప్‌-జి: బ్రెజిల్‌, సెర్బియా, స్విట్జర్లాండ్‌, కామెరూన్‌
గ్రూప్‌-హెచ్‌: పోర్చుగల్‌, ఘనా, ఉరుగ్వే, కొరియా

ఇదీ చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా సెలెక్షన్ కమిటీపై వేటు

ఇవి కూడా చదవండి: