Home / అంతర్జాతీయం
ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జపాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ ఫొటో కోసం జర్మనీ ఆటగాళ్లు వినూత్న రీతిలో ఫోజ్ ఇచ్చారు. ఫొటో తీసే ముందు ఒక్కసారిగా తమ కుడి చేతులతో నోళ్లను మూసుకున్నారు. ఎందుకిలా అనే ప్రశ్న మీకు కలిగింది కదా అయితే ఈ కథనం చూసేయ్యండి.
ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్-3 జట్టు అయిన అర్జెంటీనాను ఆసియా పసికూన అయిన సౌదీ అరేబియా (51వ ర్యాంకు) ఓడించింది. అంతేకాకుండా వరుసగా 36 మ్యాచ్ ల్లో గెలిచి టైటిల్ ఫేవరేట్‌గా ప్రపంచ కప్ బరిలోకి దిగిన మెస్సీ సేన దూకుడుకు సౌదీ అడ్డుకట్ట వేసింది.
యూఎస్ టెక్ దిగ్గజం HP సీఈవో ఎన్రిక్ లోరెస్ రాబోయే మూడేళ్లలో కంపెనీ తన శ్రామిక శక్తిని తగ్గించుకోనుందని మరియు 4,000 నుండి 6,000 మంది వ్యక్తులను తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
వర్జీనియాలోని చీసాపీక్లోని వాల్‌మార్ట్‌లో మంగళవారం రాత్రి జరిగిన కాల్పుల్లో పలువురు మరణించారని పోలీసు అధికారి తెలిపారు.
చైనాలోని ఓ గొర్రెలు మంద గుండ్రంగా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. గత 12 రోజులుగా అలుపు సొలుపు లేకుండా నిరంతరాయంగా తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
అమెరికాలో భారతీయ టెక్కీలకు గడ్డు కాలం ఎదురుకాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో హెచ్ 1బీ వీసాపై అమెరికాకు వెళ్లిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉద్యోగులను కొన్ని కంపెనీలు అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించాయి.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బాజ్వా త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. ఈ నేపధ్యంలో ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా ఆయన కుటుంబసభ్యులు, ఆయన బంధువులు కేవలం ఆరు సంవత్సరాల కాలంలో బిలియనీర్లు అయ్యారని వెల్లడించింది పాక్ డిజిటల్ మీడియా.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ ఆయన చెంపను ఛెళ్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో, డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యాపారం దెబ్బతిని టెక్ స్టాక్‌ల విలువలో పతనానికి దారి తీస్తుంది.
కొలంబియా దేశంలోని మెడెలిన్ నగరంలోని ఓ ఇంటిపై విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది మరణించారని మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు.