Last Updated:

Google employees: గూగుల్ లో మరో కీలక నిర్ణయం.. ఇకపై డెస్క్ షేర్

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయం నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ వచ్చాయి. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం తమ సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగుల్పి తొలగిస్తున్నట్టు వెల్లడించింది.

Google employees: గూగుల్ లో మరో కీలక నిర్ణయం.. ఇకపై డెస్క్ షేర్

Google employees: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయం నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ వచ్చాయి. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం తమ సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగుల్పి తొలగిస్తున్నట్టు వెల్లడించింది.

అయితే గూగుల్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయంలో నిర్వహణ ఖర్చును సైతం తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న గూగుల్ కార్యాలయాల్లో అనవసరంగా ఉన్నవాటిని ఖాళీ చేస్తున్నట్టు గూగుల్ వర్గాలు తెలిపాయి.

ఇంటర్నెల్ గా మెమో జారీ(Google employees)

దీంతో ఉద్యోగులందరినీ ఒకేచోట సర్దుబాటు చేసేందుకు కంపెనీ కసరత్తు ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు తమ డెస్క్ లను షేర్ చేసుకోవాలని ఆదేశించింది.

‘ ఇకపై గూగుల్ లో ఒకే డెస్క్ ను ఇద్దరు ఉద్యోగులు వాడుకోవాల్సి ఉంటుంది. మొదట గూగుల్ క్లౌడ్ విభాగంలో అమలు చేయనున్నారు.

కిర్క్ లాండ్, వాషింగ్టన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్, కాలిఫోర్నియా, సన్నీవేల్ లో ఉన్న ఆఫీసుల్లో అమలు చేయనున్నారు.

ఈ మేరకు ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ ఇంటర్నెల్ గా మెమో జారీ చేసినట్టు తెలుస్తోంది.

గూగుల్ క్లౌడ్ ఆఫీస్ ఎవల్యూషన్

అయితే ఉద్యోగుల మధ్య ఇబ్బందులు లేకుండా సమన్వయం చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఉద్యోగులు హైబ్రిడ్ మోడల్ లో పనిచేస్తున్నారు.

అంటే కొన్ని రోజులు ఆఫీస్ రావడం, కొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో ఉద్యోగులు కో ఆర్డినేషన్ చేసుకుని ఒక రోజు ఒకరు.. మరో రోజు ఇంకొకరు ఆఫీస్ కు రావాలని సూచించింది. ఒక వేళ డెస్క్ లేని రోజు కూడా ఆఫీస్ కు రావాలనుకునేది ఉద్యోగుల ఇష్టం అని తేల్చింది.

అయితే, ఆఫీసులో ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూర్చుని పనిచేయాల్సి ఉంటుందని సూచించింది. ఈ కొత్త విధానాన్ని ‘గూగుల్ క్లౌడ్ ఆఫీస్ ఎవల్యూషన్’ గా అభివర్ణించింది.

ఒక డెస్క్ను రెండు వేర్వేరు విభాగాలకు చెందిన వారు షేర్ చేసుకునేలా మార్పులు చేస్తున్నట్టు పేర్కొంది. దీనా ద్వారా ఉద్యోగుల మధ్య ఎలాంటి ఇబ్బందులు రావని తెలిపింది.

 

ఇవి కూడా చదవండి: