Japan: జపాన్ ప్రధానిపై బాంబు దాడికి యత్నం.. తప్పిన ప్రాణహాని
Japan: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆగంతకుడు ఆయనకు సమీపంలో స్మోక్ బాంబు విసరడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆయన్ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Japan:జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆగంతకుడు ఆయనకు సమీపంలో స్మోక్ బాంబు విసరడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆయన్ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
బాంబు విసిరిన దుండగుడు (Japan)
జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆగంతకుడు ఆయనకు సమీపంలో స్మోక్ బాంబు విసరడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆయన్ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
జపాన్ ప్రధాని పర్యటనలో బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. స్థానిక పోర్టులో పర్యటిస్తుండగా.. ఓ యువకుడు స్మోక్ బాంబు విసిరాడు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు.
ప్రధాని కిషిదా వకయామలోని సైకాజకి పోర్ట్‌లో శనివారం పర్యటించారు. ఈ పర్యటన తర్వాత ప్రసంగం చేయాల్సి ఉంది. అయితే వేదికకు సమీపంలో పేలుడు సంభవించింది.
పేలుడు శబ్దం ఒక్కసారిగా రావడంతో.. ప్రజలు ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు తీశారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రధాని ని వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈ ఘటనలో ప్రధానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.
బాంబు విసిరిన అనంతరం ఓ యువకుడు పారిపోతుండగా.. భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు.
దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా వైరల్ గా మారాయి. ఆ యువకుడే ‘స్మోక్ బాంబ్’ను విసిరినట్లు అధికారులు వెల్లడించారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య జరిగిన నెలల వ్యవధిలో ప్రధానిపై ఇలా దాడికి యత్నం జరగడం గమనార్హం.
2022 జులైలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కూడలి వద్ద షింజో అబే ప్రసంగిస్తుండగా దుండగుడు ఆయనపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అబే.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉండగా.. మరికొద్ది రోజుల్లో జపాన్‌లో జి-7 దేశాల మంత్రుల సమావేశాలు జరగనున్న వేళ.. ఈ బాంబు దాడి ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.