Last Updated:

Bangladesh: మరో హిందూ దేవాలయంపై దాడి

హిందూ దేవాలయాలపై గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని పురాతన హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆలయంలోని దేవతా విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఈ ఘటన ఇప్పుడు ఆ దేశమంతటా కలకలం సృష్టిస్తోంది.

Bangladesh: మరో హిందూ దేవాలయంపై దాడి

Bangladesh: హిందూ దేవాలయాలపై గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని పురాతన హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆలయంలోని దేవతా విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఈ ఘటన ఇప్పుడు ఆ దేశమంతటా కలకలం సృష్టిస్తోంది. పశ్చిమ బంగ్లాదేశ్‌లోని జెనైదా జిల్లాలోని దౌతియా గ్రామంలో పురాతన కాళీమాత ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం దాడి చేశారు. ఈ విషయాన్ని కాళీ మాత ఆలయ అధికారులు వెల్లడించారు. అమ్మవారి మూలవిరాట్ విగ్రహాన్ని ముక్కలుగా చేసి, విగ్రహం తలను తీసుకుని ఆలయ ప్రాంగణం నుండి అర కిలోమీటరు దూరంలో ఉన్న రహదారిపై పడవేశారని తెలిపారు.

ఈ కాళీ దేవాలయం అఖండ భారత దేశంగా ఉన్నప్పటి నుంచి హిందువుల ప్రార్థనా స్థలంగా ఉందని ఇక్కడ దసరా ఉత్సవాలను ఏటా అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కాగా దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిసిన రెండు రోజులకే ఇలా జరగడం సర్వత్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు జెనైదా పోలీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అమిత్ కుమార్ బర్మన్ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే బంగ్లాదేశ్‌లోని 169 మిలియన్ల జనాభా ఉండగా అందులో ముస్లిం జనాభా మెజారిటీ ఉంది. హిందువులు 10 శాతం మంది మాత్రమే ఉన్నారు.

ఇదీ చదవండి: ప్రేమించడం లేదని యువతిని చంపేశాడు

ఇవి కూడా చదవండి: