Home / ఆరోగ్యం
నువ్వులపై కొంత మంది ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి ఆ రోజుల్లో తింటే మంచిది కాదు.. ఈ రోజుల్లో తినకూడదు అంటూ ఉంటారు. కానీ నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందునే పండగలకు చేసుకునే పిండి వంటల్లో వాటికి ప్రముఖ స్థానం కల్పించారు పూర్వీకులు.
చికిత్సే కాని నివారణ లేని వ్యాధి ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కోట్లాది మందిని బాధిస్తోంది. వ్యాధి చికిత్సకు మెరుగైన ఔషధాలు వచ్చాయి. కానీ పూర్తి స్థాయి నివారణ అనేది మాత్రం లేదు. కొన్ని తెలిసి తెలియని పరిస్థితుల కారణంగా కొందరు ఈ మహమ్మారి బారిన పడుతుంటారు. కాగా మీకు సాధారణమైన జీవనం సాగించాలని ఉండి మీ భాగస్వామి ద్వారా సంతతి కలగాలని ఆశ ఉందా అయితే మీకు ఐవిఎఫ్( ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పెద్దతి ఓ మంచి వరం.
కిస్మిస్ అంటే ఇష్టపడని వాళ్లెవరు చెప్పండి. ఎండుద్రాక్షల ప్రయోజనం పొందాలంటే వాటిని నానబెట్టి తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే నానబెట్టిన ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ను ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి ఎవరైనా వీటిని తీసుకోవచ్చు.
ఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను భయపెడుతోన్న మంకీపాక్స్‌కు కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మంకీపాక్స్ అనే పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును ‘ఎంపాక్స్’గా మార్చింది.
ఓ చిన్నదోమ అతడి జీవితాన్నే నాశనం చేసింది. దోమకాటుతో ఓ వ్యక్తి బతికుండగానే నరకం చూశాడు. కొన్నివారాలపాటు కోమాలోనే ఉండిపోయాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది.
కరివేపాకు అంటే మనలో చాలా మందికి చిన్నచూపు భోజనంప్లేట్ లో కనిపించగానే దాన్ని తీసి పక్కన పెడతాం. అయితే కరివేపాకును తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూసేద్దాం.
ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యలేదు అనే నానుడి ప్రచారంలో ఉంది. ఉల్లి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మేలుచేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుందని పలు పరిశోధనలు స్పష్టం చేసింది.
లికాలంలో సాధారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధిస్తుంటాయి. వణికించే చలి కారణంగా కీళ్లు, మోకాళ్లు, ఎముకలలో ఎక్కువ నొప్పి కలుగుతుంది. మరి ఈ శీతాకాలంలో మీ శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు, మరికొన్ని థెరపీలు సహాయపడతాయి. అవేంటో చూసేయ్యండి.
కడుపు మరియు గుండెల్లో మంటగా ఉందా మలబద్ధకం, అజీర్ణం సమస్యలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయా? మీరు ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతున్నారా అయితే ఈ సమస్యలన్నింటికి చక్కని వంటింటి చిట్కాలు చూసేద్దాం.
తమిళనాడులో కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 4,000-4,500 ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి.