Last Updated:

Tridemic: కెనడాలో కొత్త రకం జబ్బు ట్రైడెమిక్‌.. కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

కెనడాలో తాజాగా ట్రైడెమిక్‌ అనే కొత్త వ్యాధి విస్తరించింది.. ట్రైడెమిక్‌ అనే కొత్త జబ్బు విషయానికి వస్తే ... మూడు రకాల జబ్బులు కలిసి ఉన్నాయి.

Tridemic: కెనడాలో కొత్త రకం జబ్బు ట్రైడెమిక్‌.. కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

Tridemic in Canada: కెనడాలో తాజాగా ట్రైడెమిక్‌ అనే కొత్త వ్యాధి విస్తరించింది.. ట్రైడెమిక్‌ అనే కొత్త జబ్బు విషయానికి వస్తే … మూడు రకాల జబ్బులు కలిసి ఉన్నాయి. వాటిలో కొవిడ్‌ -19, ఇనప్లూయెంజ లేదా ఫ్లూ.. రెస్పొరేటరీ సిన్సిటియల్‌ వైరస్‌ దీన్నే ఆర్‌ఎస్‌వి అని అంటారు. ఈ మూడు రకాల జబ్బులని కలిపి ట్రైడెమిక్‌ గా పిలుస్తున్నారు. కొత్త రకం వైరస్‌తో కెనడాలో శ్వాసకోత సంబంధమైన కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతోదేశంలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కొత్త రకం జబ్బును ఎలా నియంత్రించాలో ప్రభుత్వానికి అర్ధం కావడం లేదు. వచ్చిన పేషంట్స్‌కు ఎలాంటి చికిత్స అందించాలో తెలియక ఆస్పత్రి వర్గాలు సతమతమవుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది కొత్త రకం జబ్బులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. ముఖ్యంగా శ్వాసతీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కాగా ఈ కేసులు పొరుగున ఉన్న అమెరికాకు కూడా విస్తరించాయి. కాగా ఈ కొత్త రకం ట్రైడమిక్‌ కేసులు ఎక్కువగా పిల్లల్లో వస్తున్నాయని కెనడాకు చెందిన గ్లోబల్‌ మీడియా వెల్లడించింది. ఇదిలా ఉండగా కెనడాకు చెందిన రెస్‌క్రాస్‌ … ఈస్ర్టన్‌ అంటారియో చిల్ర్డన్‌ హాస్పిటిల్‌ రోగులకు చికత్స అందించేందుకు సాయమందిస్తోంది. కాగా రెడ్‌క్రాస్‌ చిన్న చిన్న బృందాలను ఆస్పత్రికి పంపించి.. అక్కడి సిబ్బందికి చేయూత నిస్తోందని రెడ్‌ క్రాస్‌ అధికార ప్రతినిధి తెలిపారు.. కాగా ఈస్ర్టన్‌ అంటారియో చిల్ర్డన్‌ ఆస్పత్రికి వరదలా వస్తున్న ఇలాంటి కేసులను దృష్టిలో ఉంచుకొని రెండో ఇన్‌టెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను గత నెలలో ప్రారంభించింది.

కెనడాలోని ఎడ్‌మౌంటెన్‌ ప్రాంతంలోని చిల్ర్డన్‌ హాస్పిటల్‌లో గత వారం ట్రైడెమిక్‌ కేసులు వందశాతం దాటిపోయాయి. దీంతో సాధారణంగా జరిగే సర్జరీలు, అపాయింట్‌మెంట్లను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చిందని గ్లోబల్‌ న్యూస్‌ వెల్లడించింది. కాగా ఈ జబ్బు ట్రైడెమిక్‌ అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం మూడు రకాల జబ్బులు .. ప్లూ, ఆర్‌ఎస్‌వి, కొవిడ్‌ -19 కలిసి ఉన్నందువల్లే దీనికి ట్రైడెమిక్‌అని పేరు పెట్టినట్లు అమెరికాకు చెందిన హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ హెల్త్‌లైనర్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి: