Last Updated:

Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు ఊహించని షాక్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ లో తన 24 క్యారెట్ల గోల్డ్‌ ఐఫోన్‌ మిస్

బాలీవుడ్‌లో బ్యూటీ "ఊర్వశి రౌతేలా" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2015 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ క్రేజ్‌తో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది. సింగ్ సాబ్ ది గ్రేట్, సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరి 4, పాగల్ పంటి..

Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు ఊహించని షాక్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ లో తన 24 క్యారెట్ల గోల్డ్‌ ఐఫోన్‌ మిస్

Urvashi Rautela : బాలీవుడ్‌లో బ్యూటీ “ఊర్వశి రౌతేలా” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2015 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ క్రేజ్‌తో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది. సింగ్ సాబ్ ది గ్రేట్, సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరి 4, పాగల్ పంటి… వంటి సినిమాలతో మంచి నటిగానే కాకుండా గ్లామర్ తో అన్నీ వర్గాల ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలిగింది. కానీ స్టార్ హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మాత్రం చేయలేకపోయింది ఈ భామ.

కానీ కమర్షియల్ యాడ్స్ తో, ఐటం సాంగ్స్ తో మాత్రం ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసేస్తుంది. దేశ వ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉన్న ఈ గ్లామర్ క్వీన్ కి.. టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు దక్కాయి. తెలుగులో మొదట బ్లాక్ రోజ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికి.. ఈ మూవీతో తగిన గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత వరుసగా  తెలుగు సినిమాల్లో వరుసగా ఐటెమ్‌ సాంగ్స్‌ చేస్తూ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేసిన ఊర్వశీ తాజాగా రామ్‌ ‘స్కంద’ సినిమాలోనూ ‘కల్ట్‌ మామా’ అంటూ అలరించారు. అలాగే అఖిల్ ‘ఏజెంట్’, పవన్ కళ్యాణ్, సాయి తేజ్‌ల ‘బ్రో’ మూవీల్లోనూ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.

అయితే అంతకు ముందు ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ తో రిలేషన్ లో ఉందంటూ వార్తల్లో నిలిచిన ఈ భామ.. ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో హైలైట్ అవుతుంది. అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు పలువురు సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. వారిలో ఊర్వశీ రౌతేలా కూడా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో తన ఖరీదైన గోల్డెన్ ఐ ఫోన్‌ను పోగొట్టుకున్నట్లు ఆమె తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

అది 24 క్యారెట్ల గోల్డ్‌ ఐఫోన్‌ అని.. ఎవరికైనా దొరికితే తెలియజేయాలని కోరారు. అలాగే ఈ విషయంలో సాయం చేయాలని కోరుతూ అహ్మదాబాద్‌ పోలీసులను ట్యాగ్‌ చేశారు. పోలీసు స్టేషన్‌ లోనూ ఫిర్యాదు చేశారు. ఆమె పోస్ట్‌కు స్పందించిన పోలీసులు ఫోన్‌ వివరాలు చెప్పాలని రిప్లై ఇచ్చారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఊర్వశీ తన ఫోన్‌లో వీడియో తీసి అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత చాలామంది ప్రేక్షకులు ఆమెతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆ సమయంలోనే ఫోన్‌ పోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)