Jr NTR: కర్ణాటక అసెంబ్లీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
నవంబర్ 1వ తేదీన దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్న ప్రదానం చేస్తున్న సందర్బంగా కర్ణాటక ప్రభుత్వం కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లను విధాన సౌధకు ఆహ్వానించింది.
Tollywood: నవంబర్ 1వ తేదీన దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్న ప్రదానం చేస్తున్న సందర్బంగా కర్ణాటక ప్రభుత్వం కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లను విధాన సౌధకు ఆహ్వానించింది.
దీని పై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ మేము రజనీకాంత్‌ను ఆహ్వానించాము మరియు అతను తన రాకను ధృవీకరించాలని మేము భావిస్తున్నాము. కన్నడ తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ మా ఆహ్వానాన్ని అంగీకరించారు. మేము జ్ఞానపీఠ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబార్‌ను కూడా ఆహ్వానిస్తున్నాము. డా. రాజ్‌కుమార్ కుటుంబాన్ని, కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, కవులు, రచయితలను ఆహ్వానించాము. పునీత్ పై ప్రజల్లో ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక రత్న అవార్డు ఇస్తున్నాం అని చెప్పారు. శాండల్ వుడ్ లో పవర్ స్టార్ గా, అభిమానులు అప్పుగా పిలుచుకునే 46 ఏళ్ల పునీత్ గత ఏడాది అక్టోబర్ 29న మరణించారు. అతను కర్ణాటక రత్న అవార్డును అందుకున్న తొమ్మిదవ వ్యక్తి కావడం విశేషం.