Last Updated:

Hari Hara VeeraMallu: ఫ్యాన్స్ కు పూనకాలే.. హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా నిర్మాతలు పవర్ గ్లాన్స్ ని శుక్రవారం విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. ‘దిగొచ్చింది భల్లు భల్లున, పిడుగే దిగొచ్చింది భలల్లు భల్లున మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో, తెలుగోడు’ అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ తో విడుదల

Hari Hara VeeraMallu: ఫ్యాన్స్ కు పూనకాలే.. హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా నిర్మాతలు పవర్ గ్లాన్స్ ని శుక్రవారం విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. ‘దిగొచ్చింది భల్లు భల్లున, పిడుగే దిగొచ్చింది భలల్లు భల్లున మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో, తెలుగోడు’ అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ తో విడుదల చేసిన పవర్ గ్లాన్స్ పవర్ ఫుల్ గా వుంది.

మీసం తిప్పి తొడగొట్టిన ఓ తెలుగోడుగా పవన్ కల్యాణ్ మల్లయోధులను మట్టికరిపించిన తీరు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. భారీ స్థాయిలో నిర్మించిన సెట్ లో వందలాది జనాల మధ్య పవన్ మల్లయోధులని మట్టికరిపించే సీన్ అభిమానులను ఆకట్టుకుంటుంది. విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పవన్ నడక, లుక్స్ రాయల్ గా వున్నాయి. మొత్తం మీద ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ పై అసంతృప్తిగా ఉన్న అభిమానులకు ఈ రోజు మంచి ట్రీట్ ఇచ్చారనే చెప్పవచ్చు.

ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌ పై ఏ. ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నాడు. ఎమ్‌. ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు.

 

ఇవి కూడా చదవండి: