Last Updated:

Tollywood News: త్వరలో వెండితెరపై “బాక్స్ బద్దలవుద్ది”..!

మూవీ హిట్ కొడితే సాధారణంగా బాక్స్ బద్దలయ్యింది అంటాము కానీ మూవీ పేరే "బాక్స్ బద్దలవుద్ది" ఉంటే ఇంక ఆ సినిమాను మూవీ మేకర్స్ ఏ లెవల్లో తెరకెక్కించబోతున్నారో ఆలోచించండి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ చందన మూవీస్ బ్యానర్లో సీడీ నాగేంద్ర నిర్మాతగా, తల్లాడ సాయి క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

Tollywood News: త్వరలో వెండితెరపై “బాక్స్ బద్దలవుద్ది”..!

Tollywood: మూవీ హిట్ కొడితే సాధారణంగా బాక్స్ బద్దలయ్యింది అంటాము. కానీ మూవే పేరే బాక్స్ బద్దలవుద్ది ఉంటే ఇంక ఆ సినిమాను మూవీ మేకర్స్ ఏ లెవల్ లో తెరకెక్కించబోతున్నారో ఆలోచించండి. ఈ క్రేజీ ప్రాజెక్టు చందన మూవీస్ బ్యానర్లో సీడీ నాగేంద్ర నిర్మాతగా, తల్లాడ సాయి క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుంది. “బాక్స్ బద్దలవుద్ది” సినిమాలో వివేకానంద విక్రాంత్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సుధాన్ కుమార్, ప్రవీణ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీని సెప్టంబర్ 10న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.

నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా ఈ సినిమా షూటింగ్ మరో 35 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. కరోనా అనంతరం సినిమా పరిశ్రమలో ఏర్పడిన సంఘటనలను ప్రధానాంశంగా తీసుకుంటూ, ఓ ఫిల్మ్ మేకర్ కలను చిత్రం రూపంలో చూపించబోతున్నట్టు దర్శకుడు తల్లాడ సాయి క్రిష్ణ తెలిపారు. అలానే మూవీ మొఘల్ రామానాయుడు ఆలోచన విధానంలో ఉన్న ఆర్కే నాయుడు అనే పాత్రలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నటించడం చాలా తమకెంతో సంతోషంగా ఉందని డైరెక్టర్ వెల్లడించారు.

నిజ జీవితంలో నిర్మాతగా ఉన్న తనని ఈ చిత్రంలో ముఖ్యమైన నిర్మాత పాత్రలో తెరపైకి తీసుకువస్తున్న సినిమా బృందానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ శుభాభినందనలు తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ, కథనంతో పాటు సినిమా టైటిల్ సైతం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. సినిమాలో సినిమా తీయడమనే కాన్సెప్ట్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటుందని ఈ సినిమా ప్రారంభానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర హీరో వివేకానంద్ విక్రాంత్. ఈ కార్యక్రమంలో సుధాన్ కుమార్, పెరుమాళ్ళ ప్రవీణ్, సతీష్, చరణ్, శశి తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: ‘జనగణమన’ గురించి మర్చిపోండి.. రౌడీ బాయ్​ ఆసక్తికర వ్యాఖ్యలు..​!

ఇవి కూడా చదవండి: