Last Updated:

Leharaayi movie: లెహరాయి చిత్రం నుండి ‘అప్సరస అప్సరస’ పాట విడుదల

రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి. తాజాగా మేకర్స్ లెహ‌రాయి చిత్రం నుండి "అప్సరస అప్సరస" అనే మరో సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆల‌పించారు.

Leharaayi movie: లెహరాయి చిత్రం నుండి ‘అప్సరస అప్సరస’ పాట విడుదల

Tollywood: రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా రామకృష్ణ పరమహంసని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది. సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంలో పాటలకు మంచి ట్యూన్స్ ఇచ్చారు.

తాజాగా మేకర్స్ లెహ‌రాయి చిత్రం నుండి “అప్సరస అప్సరస” అనే మరో సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆల‌పించారు.”తీపితో తేల్చి చెప్పా తొలితీపి నీ పలుకని తారనే పిలిచి చూపా తొలి తారా నీ నవ్వని” లాంటి లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేసాయి. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయని మంచి ఫీల్ వున్న క‌థతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు ఇదివరకే ద‌ర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస తెలిపారు.

ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ తదితరులు న‌టించిన ఈ చిత్రాన్ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్నారు. లెహరాయి రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.

 

ఇవి కూడా చదవండి: