Odela 2 Teaser: నాగ సాధువుగా తమన్నా – ఉత్కంఠగా సాగిన ‘ఓదెల 2’ టీజర్

Tamanna Odela 2 Teaser: తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2′(Odela 2). ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓదెల రైల్వేస్టేషన్ డైరెక్టర్ అశోక్ తేజయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఆయన దర్శకత్వం పర్యవేక్షణలోనే అశోక్ తేజయే ఓదెల 2 తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమన్నా నాగసాధు పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా మూవీ టీం టీజర్ విడుదల చేసింది. ప్రయాగ్ రాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభమేళలో ఈ టీజర్‌ను విడుదల చేశారు.
సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్‌లో వస్తున్న శివ భక్తి గీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. నాగా సాధువుగా తమన్నా లుక్ ఉత్కంఠ పెంచుతోంది. ఓదెల ఉరిని దుష్టశక్తుల నుంచి నాగ సాధువు అయిన తమన్నా ఎలా కాపాడిందనేదే ఈ కథ అని టీజర్‌తో అర్థమైపోతుంది. ఉత్కంఠ పెంచే సీన్స్, ఆసక్తికర అంశాలతో టీజర్‌ను ఆసక్తిగా కట్ చేశారు. ప్రస్తుతం ఓదెల టీజర్ మూవీపై అంచనాలు పెంచుతోంది. ఇందులో తమన్నా లుక్ ఆసక్తిని కలిగిస్తోంది. కాగా మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి మధు నిర్మిస్తున్నారు.