Sammelanam: ఓటీటీలో దూసుకుపోతున్న ‘సమ్మేళనం’ – అత్యధిక వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో..

Sammelanam Web Series Trending in OTT: ప్రేమ, బ్రేకప్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘సమ్మేళనం’. ఇటీవలె ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఫిబ్రవరి 20న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు విశేష స్పందనవ స్తోంది. దీంతో ప్రస్తుతం ఓటీటీలో అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. తరుణ్ మహదేవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో ప్రియ వడ్లమాని, గానాదిత్య, వినయ్ అభిషేక్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.
సునయని.బి, సాకెత్.జె సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ యూత్‌ని బాగా ఆకట్టుకుటుంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ సుమారు 50పైగా మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్ వ్యూస్ సాధించి ఈటీవీ విన్లో టాప్‌లో నిలిచింది. ఫస్ట్ రెండు ఎపిసోడ్లు కాస్తా స్లోగా సాగిన మూడో ఎపిసోడ్ నుంచి ఆసక్తిని పెంచుతుంది. అక్కడ కథ పరుగులు పెడుతూ క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ అందించిన మ్యూజిక్ మరింత ప్లస్ అయ్యింది.
కథేంటంటే
హీరో రామ్ (గణాదిత్య) ఓ రైటర్. అతడు ఓ బుక్ రాస్తాడు. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో అతడితో పాటు బుక్ గురించి పేపర్లలో ఫస్ట్ పేజీలో పడుతుంది. దాంతో అతడిని వెతుకుతూ శ్రీయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (విజ్ఞయ్), మేఘన (ప్రియా వడ్లమాని) తనను కలిసేందుకు వస్తారు. వాస్తవానికి అర్జున్, రామ్ చిన్నప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్. రైటర్ కావాలనేది రామ్ కల. అందుకోసం తన స్నేహితుడు అయిన అర్జున్ సపోర్ట్ చేస్తుంటాడు. ఆర్థికంగా కూడా ఎంతో తోడ్పాటుగా ఉంటాడు. తనకు తన ఆఫీసులో పరిచయమైన మేఘనతో అర్జున్ లవ్ లో పడతాడు. అదే అమ్మాయిని రామ్ కూడా ప్రేమిస్తాడు. ఇంతకీ ఇద్దరిలో మేఘన ఎవరిని ప్రేమించింది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విలన్ లేకపోయినా ఒకరికొకరు ఎలా దూరం అయ్యారు? మళ్లీ ఎవరిని ఎవరు కలిశారు? మేఘన లైఫ్ లో చార్లీ (శ్రీకాంత్ గుర్రం) పాత్ర ఏంటి? అనేదే సమ్మేళనం కథ.