Ritu Varma: అవకాశం ఇస్తే ముద్దు సీన్స్ కూడా చేస్తా.. ‘మజాకా’ ప్రమోషన్స్‌లో నటి రీతూ వర్మ

Actress Ritu Varma Sentational Comments in majaka movie promotions: హీరో సందీప్ కిషన్, నటి రీతూ వర్మ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో హీరో సందీప్ కిషన్, రావు రామేశ్ మధ్య జరిగే కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగ్స్ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా 26న విడుదల కానుంది.
అయితే, ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నటి రీతూ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆన్‌స్క్రీన్ ముద్దు సీన్స్‌కు నేను వ్యతిరేకం కాదని చెప్పారు. ఛాన్స్ వస్తే కిస్, హగ్ సీన్స్‌లో కూడా యాక్ట్ చేస్తానని తెలిపారు. ఇప్పటివరకు కిస్ సీన్స్ చేసే అవకాశం రాలేదన్నారు. స్టోరీ డిమాండ్ చేస్తే కిస్, హగ్ సీన్స్‌లో కూడా యాక్ట్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. కొంతమంది ఈమె ఇలాంటి సీన్స్‌లో నటించదని ఓ నిర్ణయం తీసేసుకుంటున్నారని, అందుకే కొన్ని స్టోరీలు నా వద్దకు రావడం లేదని రీతూ వర్మ చెప్పారు.