Samantha: ఏడాదిలో కోట్ల రూపాయలు వదులుకున్న సమంత – అసలేమైందంటే!

Samantha Rejects Worth of Crore Brands: ఈ మధ్య సమంత సినిమాలను బాగా తగ్గించింది. ఆమె చేతిలో ప్రస్తుతం పెద్దగా ఆఫర్స్ కూడా లేవు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పుడు అంత క్రేజ్ సమంతకు లేదనే చెప్పాలి. విడాకులు, మయోసైటిస్ తర్వాత వ్యక్తిగత సంరక్షణ, ఆరోగ్యం, ప్రశాంతమైన జీవితంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. సోషల్ మీడియాలో మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తు ఉంటుంది. మరోవైపు తనకు నచ్చిన సినిమాలు చేస్తూ.. నచ్చిన జీవితాన్ని గడుపుతున్నారు.
నచ్చిన సినిమాలనే చేస్తున్న సమంత
ఇష్టమైతే సినిమాలు చేస్తున్నారు. ఖాళీ సమయాన్ని ఆధ్యాత్మికానికి కేటాయిస్తున్నారు. తన లైఫ్ స్టైల్ తనకు నచ్చినట్టు మార్చుకున్నారు. అయితే సమంత తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన మానసిక ఆరోగ్యం, వాణిజ్య ప్రకటనలు వంటి అంశాలపై చర్చించారు. గడిచిన ఏడాది తాను ఎన్నో బ్రాండ్స్ వదులుకున్నానని, కోట్ల రూపాయలు వస్తున్నప్పటి వాటిని పక్కన పెట్టానన్నారు. వాటిని వద్దనుకోవడానికి ఓ బలమైన కారణం కూడా ఉందని చెప్పారు.
అప్పుడే అదే సక్సెస్ అనేవారు
“20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అప్పట్లో సక్సెస్ అంటే ఎన్ని సినిమాలు చేశాం, ఎన్ని బ్రాండ్లకు ప్రచారకర్తకు ఉన్నామన్నదే చూసేవాళ్లు. మన చేతిలో ఉన్న సినిమాలు, బ్రాండ్స్ బట్టే సక్సెస్‌ని నిర్వచించేవారు. ఆ సమయంలో నేను ఎన్నో మల్టీనేషనల్ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించా. అప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉత్పత్తులను ప్రమోట్ చేసేటప్పుడు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకున్నా.
15కు పైగా బ్రాండ్స్ వదలుకున్నా: సమంత
ఒకప్పుడు ఇష్టం వచ్చిన బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్నందుకు నాకు నేను క్షమాపణలు చేప్పుకుంటున్నాను. కోట్లలో డబ్బు ఇస్తామని వచ్చినప్పటికీ వాటిని వదులుకుంటున్నారు. ఏడాదిలో సుమారు 15పైగా బ్రాండ్స్ వదులుకున్నా. ఇప్పటికీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలంటే ఎన్నో బ్రాండ్స్ నా దగ్గరికి వస్తున్నాయి. కానీ, వాటిని వెంటనే నేను అంగీకరించడం లేదు. ఆయా ఉత్పత్తులను మొదట నాకు తెలిసిన ముగ్గురు వైద్యులను సంప్రదించి.. అవి సమాజానికి ఎలాంటి హాని చేయవని నిర్ధారించుకున్నాకే వాటిని చేస్తున్నా” అని చెప్పుకొచ్చారు సమంత.