Last Updated:

KCR Movie: ఓటీటీలోకి రాకింగ్‌ రాకేష్‌ ‘కేసీఆర్‌’ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

KCR Movie: ఓటీటీలోకి రాకింగ్‌ రాకేష్‌ ‘కేసీఆర్‌’ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

KCR Movie OTT Release Date: జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్‌ హీరోగా నటించిన నిర్మించిన చిత్రం కేసీఆర్‌ (కేశవ చంద్ర రమావత్‌). గరువేగ అంజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 22న ఈ సినిమా థియేటర్‌లో విడుదలై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. అదే టైంలో పలు సినిమాల రిలీజ్ ఉండటంతో ఆడియన్స్‌ పెద్దగా ఈ సినిమాపై దృష్టి పెట్టలేదు.

దీంతో థియేటర్లో ఈ సినిమా ఆదరణ కరువైంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. మరో రెండు రోజుల్లో కేసీఆర్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. కాగా డిసెంబర్‌ 28 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా సదరు సంస్థ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తూ ఆడియన్స్‌ని అలర్ట్‌ చేసింది.

సినిమా విషయానికి వస్తే..

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఓ లంబాడ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి కల్పిత కథగా ఈ సినిమా తెరకెక్కించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రసంగాలు విని ఆయనకు అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్‌ రాకేష్‌). కేసీఆర్‌ అభిమాని కావడంతో ఊరివాళ్లంతా కేశవ చంద్ర రమావత్‌ను షార్ట్‌గా కేసీఆర్‌ పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు ఇష్టపడుతుంది.

బావనే పెళ్లి చేసుకుంటా అని కలలు కంటుంది. కానీ కేశవ మాత్రం మరదలిని కాదని మరో డబ్బు ఉన్న అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతాడు. తన అభిమాన నాయకుడు కేసీఆర్‌ చేతుల మీదుగా తన పెళ్లి జరగాలనేది ఆది కోరిక. ఈ మేరకు కేసీఆర్‌ కలిసి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిణామాలు? అతడు కేసీఆర్‌ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్‌ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడనేది కేసీఆర్‌ కథ.

ఇవి కూడా చదవండి: