Oke Oka Jeevitham Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న “ఓకే ఒక జీవితం”
శర్వానంద్ హీరోగా ఇటీవల తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ బాక్సీఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. కాగా ఎప్పుడుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని ఎదురుచేసే ప్రేక్షకుల కోసం చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది.

Oke Oka Jeevitham Movie: శర్వానంద్ హీరోగా ఇటీవల తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ బాక్సీఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. కాగా ఎప్పుడుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని ఎదురుచేసే ప్రేక్షకుల కోసం చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది.
తాజాగా ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ సుమారు 15 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవనున్నట్టు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.
శ్రీ కార్తీక్ దర్శకత్వంలో టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మదర్‌సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం వీక్షకుల మన్ననలను పొందింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో కణం పేరుతో విడుదలైంది.
ఇదీ చదవండి: Salaar Movie: సలార్ కు లీకుల బెడద.. ప్రభాస్ మాస్ లుక్ అదుర్స్