Nargis Fakhri: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘హరిహర వీరమల్లు’ బ్యూటీ!

Nargis Fakhri Ties The Knot With Boyfriend: బాలీవుడ్ హీరోయిన్, ‘హరిహర వీరమల్లు’ నటి నర్గీస్ ఫక్రీ సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కింది. ప్రియుడు టోనీ బేగ్‌ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. లాస్ ఎంజెల్స్‌లోని ఒక స్టార్ హోటల్‌లో నర్గీస్ ఫక్రీ, టోనీ బేగ్‌ల వివాహం జరిగినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. అయితే వెడ్డింగ్ కేక్‌తో పాటు స్విట్జర్లాండ్ వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది. ఆమె పెళ్లిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే.
టోనీ బేగ్ అమెరికాకు చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఎంతోకాలంగా టోనీ బేగ్, నర్గీస్ రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా రాక్‌స్టార్ అనే చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది నర్గీస్ ఫక్రీ. ఆ తర్వాత మద్రాస్ కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్ 3, మొదలైన సినిమాలతో అలరించింది. హాలీవుడ్ స్పై చిత్రంలోనూ నర్గీస్ నటించింది. ‘అమావాస్య’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.