Rs 1 Lakh bill for Kangana Ranaut: హీరోయిన్‌కి షాక్.. లక్ష రూపాయల కరెంట్ బిల్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కంగనా ఫైర్!

Kangana Ranaut Gets 1 Lakh Electricity Bill from Congress Government: బాలీవుడ్ హీరోయిన్, హిమాచల్ ప్రదేశ్ మండే ఎంపీ కంగనా రనౌత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి అంశంపై అయిన ఎలాంటి సంకోచం లేకుండ ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం బీజేపీ ఎంపీ అనే విషయం తెలిసిందే. హిమచల్ ప్రదేశ్‌లోని మండే నియోజకవర్గం నుంచి ఆమె లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే నటిగా సినిమాలు కోసం ముంబై అంటూ రాజకీయాల పరమైన పనులు ఉన్నప్పుడు పార్లమెంట్ సభలకు హాజరవుతుంటారు. ఈ క్రమంలో ఆమె మనాలిలోని తన ఇంటిలో చాలా తక్కువగా ఉంటారు.
ఏంటీ దారుణం.. ఆ బిల్ చూసి సిగ్గేసింది..
ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఉంటున్న ఇల్లు కరెంట్ బిల్లు లక్ష రూపాయలు వచ్చింది. తాను ఉండని ఇంటికి ఇంత కరెంట్ బిల్ రాడమేంటని ఆమె షాక్ అయ్యారు. కంగనా రనౌత్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి. అక్కడ ఆమెకు ఓ ఇల్లు కూడా ఉంది. సినిమాలు, రాజకీయపరమైన వ్యవహరాల నేపథ్యంలో ఆమె ముంబై లేదా ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటారు. మనాలిలోని తన ఇంటిలో ఉండటం చాలా తక్కువ. అయినా ఆ ఇంటి కరెంట్ బిల్లు లక్ష రూపాయల వరకు వచ్చింది. దీంతో దీనిపై స్పందిస్తూ.. నేను ఉండని ఇంటికి ఇంత బిల్లు రావడమేంటని ప్రశ్నించారు. ‘మనాలిలోని ఇంటిలో ప్రస్తుతం నేను ఉండటం లేదు. అయినప్పటికీ ఆ ఇంటి కరెంట్ బిల్లు లక్ష రూపాయల వరకు వచ్చింది. ఆ బిల్ చూసి షాక్ అయ్యాను. ఏంటీ ఈ దారుణం. ఆ బిల్ చూసి నాకు సిగ్గేసింది’ అని అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్..
ఇక కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఉద్దేశిస్తూ ఇలా వ్యాఖ్యానించారు. తోడేళ్ల కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, రాష్ట్ర సంక్షేమం కోసం క్షేత్ర స్థాయిలో మనమంతా మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హిమచల్ ప్రదేశ్‌లోని రాజకీయపరంగా దుమారం రేపుతున్నాయి. ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే.. ఆమె స్వీయ దర్శకత్వంలో నటించిన ఎమర్జేన్సీ మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరిలో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.