Last Updated:

JD Chakravarthy: రాఘవేంద్రరావును బూతులు తిట్టాను.. మా అమ్మకు సీరియస్ గా ఉంటే.. ఆయనేమో

JD Chakravarthy: రాఘవేంద్రరావును బూతులు తిట్టాను.. మా అమ్మకు సీరియస్ గా ఉంటే.. ఆయనేమో

JD Chakravarthi: సాధారణంగా ఇండస్ట్రీలో గొడవలు సహజం. సెట్ లో హీరోకు హీరోయిన్ కు.. డైరెక్టర్ కు హీరోకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సీరియస్ అవుతూ ఉంటాయి. ఇంకొన్ని ఆరోజే ముగిసిపోతాయి. అయితే ఆ గొడవ  తరువాత  వారు నార్మల్ గా ఉన్నారా.. ? లేదా.. ? అనేది సమస్య. చాలా తక్కువమంది మాత్రమే గొడవలో.. కోపంలో అని ఉంటారులే అని అర్ధం చేసుకుంటారు. అలా తనను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అర్ధం చేసుకున్నాడని సీనియర్ హీరో జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.

 

జేడీ చక్రవర్తి.. శివ సినిమాలో ఒక విలన్ గా కెరీర్ ను ప్రారంభించాడు. అందులో ఆయన పాత్ర పేరు జేడీ కావడం.. అది హిట్ కావడంతో ఆయన పేరు ముందు జేడీ యాడ్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో విలన్ గా నటించి హీరోగా మారాడు. జేడీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో బొంబాయి ప్రియుడు ఒకటి. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంభ హీరోయిన్ గా నటించింది.

 

1996లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో రాఘవేంద్రరావుకు జేడీకి గొడవ జరిగిందట. గొడవ అంటే ఇద్దరు అరుచుకోవడం కాదు.. డైరెక్టర్ పైనే జేడీ విరుచుకుపడ్డాడట. ఈ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

 

“బొంబాయి ప్రియుడు సినిమాలో ఒక సాంగ్ షూట్ కోసం మారిషస్ వెళ్ళాము. నాతో పాటు అమ్మను కూడా తీసుకెళ్ళాను. అక్కడకు వెళ్ళాకా అమ్మకు సడెన్ గా ఆరోగ్యం బాలేదు. వెంటనే నేను నా పర్సనల్ డ్రైవర్ తో అమ్మను హాస్పిటల్ కు తీసుకెళ్లమని చెప్పాను. ఒక్కరోజు షూటింగే కావడంతో షూట్ అవ్వగానే అమ్మతో పాటు డైరెక్ట్ గా ఎయిర్ పోర్టుకు వెళ్లాలని అనుకున్నాను.

Allu Aravind: అల్లు అరవింద్ కు ఏమైంది.. కేరళలో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ?

షూటింగ్ అయ్యిపోయింది. డ్రైవర్ కు చెప్పి అమ్మను అటునుంచి అటు ఎయిర్ పోర్టుకు తీసుకురమ్మన్నాను. మారిషస్ హాస్పిటల్స్ లో రూల్ ఏంటి అంటే.. ఎవరైతే జాయిన్ చేశారో వారే డిశ్చార్చ్ చేసేటప్పుడు ఉండాలి. వేరేవాళ్లు వెళితే పంపించరు. అందుకే డ్రైవర్ ను వెళ్లి తీసుకురమ్మన్నాను. కొద్దిసేపటి తరువాత డ్రైవర్ అక్కడే లొకేషన్ లో కనిపించాడు. అదేంటీ.. నిన్ను హాస్పిటల్ కు పంపించానుగా. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడిగితె.. వాడు ఏదో గొణుక్కుంటూ ఉన్నాడు.

 

అప్పటికే ఆలస్యం అవుతుంది.. గట్టిగా డ్రైవర్ ను నిలదీశాను. మీరేమో అమ్మగారిని హాస్పిటల్ నుంచి తీసుకురమ్మన్నారు. డైరెక్టర్ గారేమో హీరోయిన్ అమ్మను షాపింగ్ కు తీసుకెళ్ళమంటున్నారు. నేనేం చేయను అంటూ చెప్పుకొచ్చాడు. నాకు కోపం కట్టలు తెంచుకుంది. మా అమ్మకు సీరియస్ గా ఉంటే.. షాపింగ్ అని చెప్తున్నాడు ఏంటి అని.. డైరెక్టర్ గా రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లి అరిచేశాను. బూతులు కూడా తిట్టేశాను.

 

నా కోపం చూసి ఆయన షాక్ అయ్యారు. ఏంటి జేడీ ఇంత కోపంగా ఉన్నాడు.. నేనెప్పుడూ అలా చూడలేదు అని చెప్పుకొస్తున్నాడు. అక్కడ కెమెరా మ్యాన్ ఛోటా కె నాయుడు నాకు సర్ది చెప్పాలని చూసాడు. అయినా నా కోపం ఆగలేదు. ఇక అక్కడే కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ ఉంది. ఆమె వచ్చి నన్ను బుజ్జగించింది. ఆ తరువాత నేను చల్లబడ్డాను. వెంటనే రాఘవేంద్రరావు.. డ్రైవర్ ను మా అమ్మను తీసుకురావడానికి పంపాడు.

 

ఆ గొడవ ఆతరువాత ఎవరైనా తనను తిట్టినందుకు నాతో మాట్లాడేవారు కాదు. కానీ, రాఘవేంద్రరావు నా కోపాన్ని అర్ధం చేసుకొని.. నేను అన్న మాటలను మనసులో పెట్టుకోకుండా తిరిగి మాట్లాడారు. ఆ తరువాత కూడా మా మధ్య బంధం కొనసాగింది. ఎప్పుడు ఈ విషయం గురించి మాట్లాడినా ఆయన సరదాగా నవ్వేస్తారు” అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి: