K Raghavendra Rao: నాగ చైతన్య తండేల్ మూవీపై రాఘవేంద్రరావు రివ్యూ – ఏమన్నారంటే!
![K Raghavendra Rao: నాగ చైతన్య తండేల్ మూవీపై రాఘవేంద్రరావు రివ్యూ – ఏమన్నారంటే!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/radhavendra-rao-on-thandel.jpg)
Raghavendra Rao Review on Thandel: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించి తండేల్ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దేశభక్తి, ప్రేమకథ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. దీంతో థియేటర్లకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఫస్ట్ డే రూ. 21.7 కోట్ల గ్రాస్ మంచి ఒపెనింగ్ ఇచ్చి నాగచైతన్య కెరీర్‌లోనే హయ్యేస్ట్ ఒపెనింగ్ చిత్రంగా తండేల్ నిలిచింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ అంతా గుండెని పిండేసిందంటూ రివ్యూస్ ఇస్తున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర తండేల్ మూవీపై తన రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా చూసిన ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
“చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూసాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ దాని నేపధ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ద బాగుంది. ఈ చిత్రంతో సక్సెస్ గీత ఆర్ట్స్ వారికి అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా..!” అంటూ రాసుకొచ్చారు. అగ్ర దర్శకుడైన రాఘవేంద్ర రావు నుంచి ప్రశంసలు రావడంతో నాగ చైతన్య ఆనందం వ్యక్తం చేశాడు. ఆయన థ్యాంక్యూ చెబుతూ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు. “థ్యాంక్యూ సో మచ్ సర్. మీ మాటలు నాకెంతో విలువైనవి. మీకు మా సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది” అని రాసుకొచ్చాడు.
చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూసాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ దాని నేపధ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ద బాగుంది. ఈ చిత్రంతో సక్సెస్ గీత ఆర్ట్స్ వారికి అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా..! pic.twitter.com/wUNg1dZBAT
— Raghavendra Rao K (@Ragavendraraoba) February 8, 2025
యథార్థ సంఘటన ఆధారంగా ఇంటెన్స్ లవ్‌స్టోరీగా తండేల్‌ను రూపొందించాడు చందూ మొండేటి. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన జాలర్లు వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కుతారు. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారు విడుదలై ఇండియాకు వచ్చారు. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని దీనికి ప్రేమకథ జోడించి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. తండేల్ సాయి పల్లవి, నాగచైతన్యల యాక్టింగ్ విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. కొన్ని సన్నివేశాల్లో చైతన్య తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ని భావోద్వేగానికి గురి చేశాడు. ఇక సాయి పల్లవి అయితే ప్రియురాలి పాత్రలో జీవించింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.