Last Updated:

Harish Shankar : ఆ కారణాల వల్లే తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు రావట్లేదు : హరీష్ శంకర్

Harish Shankar : తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో గొప్ప నటీమణులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా మన తెలుగు వారు గతంలో ఎక్కువ మంది ఉండే వారు. ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలలో హీరోయిన్లుగా ఉన్నవారి సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. అంజలి, కలర్స్ స్వాతి, ఈషా రెబ్బా, రీతూ వర్మ, చాందిని చౌదరి, నభా నటేష్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇలా తక్కువ

Harish Shankar : ఆ కారణాల వల్లే తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు రావట్లేదు : హరీష్ శంకర్

Harish Shankar : తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో గొప్ప నటీమణులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా మన తెలుగు వారు గతంలో ఎక్కువ మంది ఉండే వారు. ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలలో హీరోయిన్లుగా ఉన్నవారి సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. అంజలి, కలర్స్ స్వాతి, ఈషా రెబ్బా, రీతూ వర్మ, చాందిని చౌదరి, నభా నటేష్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇలా తక్కువ మంది మంది మాత్రమే తెలుగులో రాణిస్తున్నారు. అలానే పలువురు నటీమణులు తెలుగు వారైనప్పటికి తమిళ ఇండస్ట్రిలో దూసుకుపోతున్న వారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని పలువురు తెలుగు హీరోయిన్లు బహిరంగంగానే వ్యక్తపరిచారు అయిన కానీ టాలీవుడ్ లో వేరే రాష్ట్రాల వారికే అధిక ప్రాధాన్యతని ఇస్తున్నారు.

కాగా తాజాగా ఇదే విషయం పట్ల ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. బ్రహ్మానందం, స్వాతి, శివాత్మిక, స‌ముద్ర ఖ‌ని, పలువురు కీలక పాత్రలలో న‌టిస్తోన్న యాంథాల‌జీ చిత్రం ” పంచతంత్రం “. ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా… అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీవితా, హరీష్ శంకర్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ… ఈ సినిమాలో నటించిన వారంతా తెలుగమ్మాయిలు అని చెప్తుంటే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఒక రచయితగా నా సినిమాలలో తెలుగు వాళ్ళని పెట్టుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే వేరే భాష వాళ్ళు అయితే సీన్స్, డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది దాంతో టైం వేస్ట్ అవుతుంది. కానీ మార్కెట్ ఈక్వేషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, పలు కారణాల వల్ల తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వలేకపోతున్నాము. ఈ విషయం నేను కూడా ఒప్పుకుంటాను, ఎక్కడో తెలుగు అమ్మాయిలకి న్యాయం జరగట్లేదు. ఈ విషయంలో నేను సారీ చెప్తున్నాను అని హరీష్ అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి: