Home / సినిమా వార్తలు
బాలీవుడ్లో మరో జంట ఒక్కటి కాబోతోంది. ఈ నెల 23న ముంబైలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. అప్పుడే సెలెబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.అయితే సోనాక్షికి జహీర్‌కు మధ్య రిలేషన్ షిప్ ఎప్పుడు మొదలైంది. మొదటిసారి వారు బహిరంగంగా ప్రజల ముందుకు ఎప్పుడొచ్చింది ఒక లుక్కేద్దాం.
శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా తన బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌లో ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోమవారం జాతీయ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఆయన తండ్రి బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు.
బాలీవుడ్‌కు చెందిన మరో నటి ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌తో కలిసి నటించిన నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు.ముంబైలోని లోకండ్వాలా ఫ్లాట్‌లో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
హీరోహీరోయిన్ల క్రేజ్‌ను బట్టి వాళ్లవాళ్ల ప్లేస్‌లు డిసైడ్ అవుతుంటాయి. ఐతే.. ఇవి సినిమా సినిమాకి.. మారిపోతుంటాయి. ఒక్కోసారి రోజుల గ్యాప్‌లో కూడా ప్లేస్‌లు ఛేంజ్ అవుతుంటాయి. నెలనెలా ఎవరెవరు టాప్ ప్లేస్‌లో ఉన్నారో ఆర్మాక్స్ మీడియా సంస్థ ఓటింగ్ నిర్వహించి లిస్ట్ రిలీజ్ చేస్తుంది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. నటి హేమకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నటి హేమ, అషీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఇటీవల ముంబైలో ఓటు వేయడానికి భర్త రణవీర్‌సింగ్‌తో వెళ్లినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయాయి. సోషల్ మీడియా యూజర్లు ఆమెది ఫేక్ బేబీ బంప్ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
తేజ సజ్జా- ప్రశాంత్ వర్మల కాంబినేషన్లో సంక్రాంతికి విడుదలయిన హనుమాన్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెకన్లలో దూసుకుపోతోంది. కేవలం విడుదలయిన 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఈ చిత్రం ఐదవ స్దానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర 2 టీజర్ నేడు రిలీజ్ అయింది. ఊహించినట్లుగానే టీజర్ వైఎస్సార్, జగన్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఒక అంధుడు తన లాంటి వారెందరో రాజశేఖర్ రెడ్డి కొడుకు వెనుక ఉన్నారంటూ చెప్పిన మాటలతో టీజర్ ప్రారంభమయింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం హనుమాన్.ఈ చిత్రం జనవరి 12న విడుదలవుతోంది. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం కూడా రిలీజ్ అవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలోని 76 సింగిల్ స్క్రీన్లలో 70 గుంటూరు కారం కోసం కేటాయించారు.
కేజీఎఫ్ స్టార్ యశ్ ఏడాదిన్నర తరువాత తన తదుపరి చిత్రానికి సిద్దమయ్యాడు. టాక్సిక్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్‌ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.